రూ.75 టికెట్‌ ఆఫర్‌ వాయిదా వెనుక బ్రహ్మాస్తం పని చేసిందా?

Update: 2022-09-14 07:33 GMT
నేషనల్ సినిమా డే అంటూ సెప్టెంబర్‌ 16వ తారీకున జరుపుకోవాలని అందరు సినీ ప్రముఖులు భావించారు. అందులో భాగంగా ప్రముఖ మల్టీప్లెక్స్ లు అన్నీ కూడా ఆ రోజున తమ అన్ని స్క్రీన్‌ లో ఆడుతున్న సినిమాల యొక్క టికెట్లను కేవలం రూ.75 లకే ఇస్తాం అంటూ ఆఫర్ ప్రకటించిన విషయం తెల్సిందే.

అక్కడ ఉండే టికెట్ల రేట్ల కారణంగా ఎప్పుడూ కూడా మల్టీ ప్లెక్స్ మొహం చూడని వారు సైతం ఆ 75 రూపాయలతో ఈసారి మల్టీ ప్లెక్స్ కి వెళ్లి అక్కడ సినిమాను కొత్తగా ఎక్స్‌ పీరియన్స్ చేయాలని భావించారు. అంతా ఆ తేదీ కోసం వెయిట్‌ చేస్తున్నారు.. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు మొదలు అవుతాయా అంటూ అంతా ఆసక్తి గా చూశారు.

తీరా చూస్తే సెప్టెంబర్‌ 16వ తారీకున సినిమా డే కాదని.. సెప్టెంబర్‌ 23వ తారీకున సినిమా డే జరుపుకుందాం అంటూ మల్టీ ప్లెక్స్ యాజమాన్యాల నుండి ప్రకటన వచ్చింది. ఉన్నట్టుండి సినిమా డే డేట్ ని మార్చడం ఏంటీ విడ్డూరం కాకుంటే అంటూ కొందరు మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో సినిమా డే తేదీ మారడం వెనుక బ్రహ్మాస్త్ర టీమ్ పని చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సమయంలో సినిమా ను మల్టీ ఫ్లెక్స్ లో కేవలం 75 రూపాయలకే చూపించడం వల్ల కచ్చితంగా నష్టం భారీగానే ఉంటుంది.

ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుందా అనే అనుమానంతో ఉన్న సమయంలో ఇలా సినిమా ను ఒక రోజు మొత్తం తక్కువ టికెట్‌ రేట్లకు అమ్మడం వల్ల కోట్లలో వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే బ్రహ్మాస్త్ర టీమ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి సినిమా డే రోజు ఇస్తామన్నా ఆఫర్‌ ని వాయిదా వేయించారంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News