‘మా’ పోలింగ్ లో బెనర్జీపై మోహన్ బాబు చేయి చేసుకున్నారా?

Update: 2021-10-18 05:12 GMT
మా’ ఎన్నికల వ్యవహారం రచ్చరచ్చగా మారటం.. చివరకు మంచు విష్ణు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే. ‘మా’ పోలింగ్ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని.. పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లుగా వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకురుస్తూ.. ఈ మధ్యన ప్రకాశ్ రాజ్ టీం పెట్టిన ప్రెస్ మీట్ లోనూ పలువురు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయనో మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఓపెన్ అయ్యారు.

పోలింగ్ వేళ.. సీనియర్ నటుడు బెనర్జీ మీద మోహన్ బాబు చేయి చేసుకున్నారన్న వాదనలో నిజం ఎంత? మోహన్ బాబు తీరుపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారు? అక్కడేం జరిగిందన్న దానికి ఆయన చెప్పిందేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రకాశ్ రాజ్ ఏం చెప్పారన్నది చూస్తే.. ఇంటర్వ్యూలో ఒక చోట.. ‘బెనర్జీని మోహన్ బాబు కొడుతుంటే ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇంకో పిల్లవాడిని బూతులు తిడితే ఏమీ అనలేదు. లోపలకు వచ్చినోడు మా పేపర్ తీసి వాళ్ల పేపరు చేతికి ఇస్తే.. మురళీ మోహన్ చూస్తూ ఉన్నారే తప్పించి ఇంకేమనలేదన్నారు.

బెనర్జీని కొట్టారా? అని మరోసారి ప్రశ్నించినప్పుడు స్పందించిన ప్రకాశ్ రాజ్.. కొట్టటానికి వెళ్లారని.. బూతులు తిట్టారని.. ఆయన ఏజ్ పెద్దది కదా? అన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారిగా పని చేసిన క్రిష్ణమోహన్ మీద ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయగా.. ఆయన పది ఎన్నికలు కండక్ట్ చేశారు కదా? అన్న ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ అనూహ్యంగా స్పందించారు.

ఎన్నికల అధికారిగా పని చేసిన క్రిష్ణమోహన్.. మోహన్ బాబు.. నరేశ్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లాయర్ అని.. ఆయన ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను రెండుసార్లు కలిశానని.. తనంటే అభిమానమని చెప్పారు. ఒక రోజంతా కలిసి మాట్లాడుకున్నామని.. అన్నీ మాట్లాడినప్పడు అభినందించారన్నారు. అందరికి ఇలా ఉండాలని చెబుతానని.. తనను బొమ్మరిల్లు ఫాదర్ అంటారని కేసీఆర్ తనతో చెప్పి జోక్ చేశారన్నారు. అలా అని కేసీఆర్ నాకు చాలా క్లోజ్ అనుకుంటే తనకున్న మెచ్యురిటీకి సిగ్గే కదా? అని వ్యాఖ్యానించారు.




Tags:    

Similar News