అసలు నందమూరి బాలకృష్ణ ఏ క్షణాన ఎన్టీఆర్ బయోపిక్ టేకప్ చేసేందుకు నిశ్చయించుకున్నాడో గానీ అప్పుడే చాలామంది ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్ చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎంత సక్సెస్ ఉందో.. అలానే వివాదాస్పద ఘట్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూపడం అంత సులువు కాదు కదా? సరే.. ఫైనల్ గా బాలయ్య తన వెర్షన్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో రెడీ చేస్తే.. పక్కలో బల్లెంలా రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెడీ చేస్తున్నాడు.
ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా సృష్టిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ఫ్యామిలీని నెగెటివ్ గా చూపించినట్టు స్పష్టమవుతోంది. మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నెగెటివ్ యాంగిల్ లో చూపిస్తే వారు ఊరుకుంటారా? ఈ సినిమాకు నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? దీనిపై ఫిలిం నగర్లో ఒక రూమర్ ప్రచారంలో ఉంది. నందమూరి కుటుంబంలో ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై చర్చ జరుగుతోందట. సెన్సార్ ద్వారా ఈ సినిమాను ఆపాలని వారు ప్లాన్ చేస్తున్నారట. నందమూరి కుటుంబ సభ్యులను చెడుగా చూపించారు కాబట్టి ఆ సినిమాను రిలీజుకు ముందుగా తమకు చూపించాలని పురందేశ్వరి చేత సెన్సార్ వారిక ఒక లెటర్ రాయించారని టాక్ వినిపిస్తోంది.
కానీ ఆర్జీవీ ఈ డిమాండ్ కు ఒప్పుకోలేదని.. రిలీజ్ తర్వాత అందరితో పాటే సినిమా చూసి.. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోమని అన్నాడట. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయంపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ ఈ సినిమాపై కామెంట్లు చేయడం.. వర్మ పై మాటల యుద్ధం చేయడం లాంటివి చేస్తే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు మరింతగా ప్రచారం కల్పించినట్టు అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికి వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ వర్మ సినిమా రిలీజ్ చేసే సమయానికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.