నాని సిస్ట‌ర్ అంథాల‌జీ కోసం పోటీప‌డ్డారా?

Update: 2022-11-24 00:30 GMT
టాలీవుడ్ లో ఎక్క‌డ చూసినా వ‌రుస నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. ఏ చిన్న కాన్సెప్ట్ ల‌భించినా దాన్ని సినిమాగానే..సిరీస్ గానో తెల‌ర‌పైకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఊహించ‌ని వారు మెగా ఫోన్ ప‌డుతూ తెర‌పైకొస్తున్నారు.

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఎలా వుందంటే ఆరు సినిమాలు ప‌ది సిరీస్ లు అన్న‌ట్టుగా యారింది. ఓటీటీ ప్ర‌భావం బాగా పెరిగిన నేప‌థ్యంలో సినిమాలు, సిరీస్‌ల నిర్మాణం కూడా రికార్డు స్థాయిలో జ‌రుగుతోంది. మునుపెన్న‌డూ లేని విధంగా సినిమాలు, సిరీస్ ల నిర్మాణం జ‌రుగుతుండ‌టంతో ఓటీటీలు కొత్త కండీష‌న్ లు పెట్ట‌డం మొద‌లు పెట్టాయి.

సినిమాల‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌నివ్వ‌డం లేదు.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అనిపించుకున్న త‌రువాతే చిన్న సినిమాల‌ని ఓటీటీలు క‌న్సిడ‌ర్ చేస్తున్నాయి. ఇక అంథాల‌జీల‌ని అయితే పెద్ద‌గా తీసుకోవ‌డం లేదు. కార‌ణం వీటిపై ఆడియ‌న్స్ పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఆ కార‌ణంగానే ఓటీటీ కూడా చాలా వ‌ర‌కు అంథాల‌జీల‌ని అవాయిడ్ చేస్తున్నాయి. చాలా మంది ద‌ర్శ‌కులు స్క్రిప్ట్ లు రెడీ చేసుకుని ఓటీటీల వ‌ర‌కు వెళ్లి వీటిని తీసుకోవ‌డం లేద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదిలా వుంటే అంథాల‌జీల‌ని ఓటీటీలు అవైడ్ చేస్తున్న వేళ నేచుర‌ల్ స్టార్ నాని త‌న సిస్ట‌ర్ ప్ర‌శాంతి త్రిపుర‌నేనిని డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన అంథాలజీ 'మీట్ క్యూట్'. మొత్తం ఐదు క‌థ‌ల‌తో రూపొందిన సిరీస్ ఇది.

అయితే అంథాల‌జీల‌ని ప‌క్క‌న పెడుతున్న ఓటీటీలు ఎలా ఈ సిరీస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయ‌న్న‌ది ఇప్ప‌డు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అయితే దీని వెన‌క ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ వుంద‌ని, ఆ స్టోరీని హీరో నేచుర‌ల్ స్టార్ నాని తాజాగా బ‌య‌ట‌పెట్టేశాడు.  

షూటింగ్ ద‌శ‌లోనే ఈ సిరీస్ పై సోనీ లీవ్ ఓటీటీ ఆస‌క్తిని చూపించ‌డం మొద‌లు పెట్టింద‌ని, త‌న సిస్ట‌ర్ తో పాటు టీమ్ చూపిస్తున్న ఆస‌క్తిని గ‌మ‌నించి రెండు మూడు ఎపిసోడ్ లు చూశాకే తీసుకుంటామన్నార‌ని వెల్ల‌డించాడు. అంతే కాకుండా చాలా వ‌ర‌కు ఓటీటీలు విష‌యం తెలిసి మేం కొంటాం అంటూ పోటీప‌డ్డాయ‌ట‌. ఇంత‌గా ఓటీటీలు ఈ అంథాల‌జీ కోసం పోటీప‌డ‌టానికి కార‌ణం నాని. అంతే కాకుండా ఇందులో పేరున్న న‌టీన‌టులు న‌టించ‌డం కూడా ఓ కార‌ణంగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News