దాదాపు పదకొండేళ్ల క్రితం దర్శకుడిగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు పూరి జగన్నాథ్. తను చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు కావడం.. ఫైనాన్సియల్ గా ఇబ్బందుల్లో వుండటంతో గురువు వర్మ ద్వారా అమితాబ్ బచ్చన్ ని కన్విన్స్ చేసిన పూరి జగన్నాథ్ `బుడ్డా హోగా తేరా బాప్` సినిమాతో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ మూవీ పూరీకి భారీ విజయదాన్ని అందించడమే కాకుండా తెలుగులో మళ్లీ బిజీ అయ్యేలా చేసింది.
ఇప్పడు అదే ఫార్ములాని పూరి అమలు చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ `లైగర్`. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు ఐదు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన పూరికి `లైగర్` గట్టి షాకిచ్చింది.
ఈ మూవీ కారణంగా విజయ్ దేవరకొండతో పూరి చేస్తున్న `జనగణమన` కూడా మధ్యలోనే ఆగిపోయింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసినా తాజా పరిణామాల నేఫథ్యంలో ఈ మూవీని ఆపేశారు. పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలంటే ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొట్టాల్సిందే. మరి పూరికి డేట్స్ ఇచ్చే హీరో ఎవరు? ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు, టైర్ టు హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీంతో పూరి బాలీవుడ్ హీరోలపై దృష్టిపెట్టాడట.
11 ఏళ్ల క్రితం `బుడ్డా హోగా తేరా బాప్` సినిమాతో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో అదే తరహాలో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మళ్లీ చెలరేగిపోవాలనుకుంటున్నారట. ఇందు కోసం ఇప్పటికే ముంబైకి వెళ్లిపోయిన పూరి అక్కడ కొత్త కథని వండటం మొదలు పెట్టారట. `లైగర్` టైమ్ లోనే సల్మాన్ ఖాన్, షారుఖ్ తనతో సినిమాలు చేయాలని ఆసక్తిని చూపించారట. కానీ లైగర్ ఫ్లాప్ తో ఇప్పడు వాళ్లు పూరికి డేట్స్ ఇవ్వడం కష్టమే.
ఈ నేపథ్యంలో పూరి ముందుకున్న ఏకైక ఆప్షన్ ఆకాష్ పూరి. తన కెరీర్ ని గాడిలో పెట్టడానికైనా తనతో పూరి సినిమా చేసే అవకాశం వుందని అంటున్నారు. బాలీవుడ్ లో భారీ సినిమా చేయాలంటే పూరికి హీరో దొరకాలి. దీంతో తనతో కలిసి వచ్చే హీరో కోసం పూరి అన్వేషణ మొదలు పెట్టాడట. తెలుగులో సినిమా చేయాలంటే బాలకృష్ణ ఒక్కడే పూరికి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.
`పైసా వసూల్` నుంచి ఇద్దరి మధ్య మంచి రాపో ఏర్పడింది. మరి దాని ప్రకారం పూరి .. బాలయ్యతో సినిమా చేస్తాడా అంటే ఇప్పడు బాలయ్య ఖాలీగా లేడు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిల సినిమాలు పూర్తి కావాల్సిందే. దీంతో పూరికి వున్న ఏకైక ఆప్షన్ తనయుడు ఆకాష్ పూరినే. మరి పూరి బాలీవుడ్ హీరో కోసం ఎదురుచూస్తాడా? .. లేక తనయుడు ఆకాష్ తో సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.