చరణ్ మళ్లీ ఆ బ్యానర్ లో సినిమాలు చేస్తారా?
ఐతే చేసిన 4 లో ఒకటి మాత్రమే సూపర్ హిట్ కాగా మిగతా 3 సినిమాల్లో రెండు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇక కొణిదెల ప్రొడక్షన్ లో సినిమాలు చేయడం ఆపేశారు.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ స్పెషల్ గా ఉండాలని మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ పూర్తిస్థాయి నిర్మాతగా మారి ఆ సినిమా తెరకెక్కించారు. ఐతే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ అవ్వడంతో సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. పదేళ్లుగా మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ గా నిలిచింది. కొణిదెల ప్రొడక్షన్స్ మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఆ సినిమా తర్వాత ఇదే బ్యానర్ లో చిరు డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా కూడా తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 150 కోట్ల పైన బడ్జెట్ తో సైరా సినిమా రూపొందించారు. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఆ తర్వాత తీసిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ లో కేవలం చిరు సినిమాలే చేస్తారా ఏంటి అని అందరు అంటున్నా కూడా చేసిన 4 సినిమాలు చిరుతోనే చేశాడు రాం చరణ్.
ఐతే చేసిన 4 లో ఒకటి మాత్రమే సూపర్ హిట్ కాగా మిగతా 3 సినిమాల్లో రెండు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇక కొణిదెల ప్రొడక్షన్ లో సినిమాలు చేయడం ఆపేశారు. రాం చరణ్ యువి విక్రం తో కలిసి వి మెగా ప్రొడక్షన్స్ అనే మరో కొత్త బ్యానర్ మొదలు పెట్టాడు. సో చరణ్ కొత్త బ్యానర్ పెట్టాడు అంటే కొణిదెల బ్యానర్ దాదాపు క్లోజ్ అయినట్టే అని అనుకుంటున్నారు. మరి చరణ్ మళ్లీ ఆ బ్యానర్ లో సినిమాలు చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గీతా ఆర్ట్స్, అంజన ఆర్ట్స్ లో సినిమాలు చేశారు. కొణిదెల బ్యానర్ లో నాలుగు సినిమాలు చేశారు. అసలైతే ఆ కొణిదెల బ్యానర్ లో పవర్ స్టార్ సినిమా కూడా ఉంటుందని అప్పట్లో వార్తలు రాగా అవేవి వాస్తవం కాదని తేలింది. ఇప్పుడు చరణ్ కూడా వేరే ప్రొడక్షన్ లో భాగం అవ్వడం చూస్తుంటే మెగా బ్యానర్ దాదాపు మూత పడినట్టే అని చెప్పుకుంటున్నారు. చరణ్ మళ్లీ కొణిదెల బ్యానర్ లో సినిమాలు చేస్తారా లేదా అన్నది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలకు అడ్డుకట్ట వేయడం కష్టమని చెప్పొచ్చు.