సూపర్ స్టార్‌ని సరిగ్గా వాడుకోలేక పోయాం
రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్ గురించి ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని దక్కించుకుని సీఎం పీటంపై కూర్చోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై పూర్తి స్థాయిలో శ్రద్ద పెట్టడం కోసం ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నాడు. ఇటీవల ది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ నటించిన ప్రతి సినిమా మినిమం వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టించింది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకునే విధంగా విజయ్ సినిమాలు నిలుస్తున్నాయి. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో విజయ్ సైతం ఒకరు. సౌత్‌లో మొదటగా వంద కోట్లు, అంతకు మించి పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలిచాడు. ఇప్పుడు అల్లు అర్జున్ రూ.300 కోట్ల పారితోషికం తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా విజయ్ రూ.275 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సమయంలో ఆయన ఇండస్ట్రీని వదిలేసి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు.
రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్ గురించి ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఆయన గొప్ప నటుడు అంటూ చెప్పుకొచ్చాడు. తమిళ సినిమా ఇండస్ట్రీ సరిగ్గా విజయ్‌ని వాడుకోలేక పోయింది. ఆయనతో గొప్ప సందేశాత్మక సినిమాలను చేయడంతో పాటు, ఎన్నో గొప్ప కథలు చెప్పే అవకాశం ఉంది. కాని సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం అంతగా ఆయన ప్రతిభను వాడిన దాఖలాలు లేవు అన్నాడు. కోలీవుడ్ మొత్తం ఆయన ప్రతిభను వృధా చేశారేమో అనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. విజయ్ ని కమర్షియల్ సర్కిల్‌లో ఉంచడం వల్ల ఆయన నుంచి గొప్ప సినిమాలు మిస్ అయ్యాయి అంటూ వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ది గోట్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదు అంటూ పెదవి విరిచారు. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో అయినా కోలీవుడ్ కి వెయ్యి కోట్ల వసూళ్లను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. కోలీవుడ్ ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమాను చూడలేదు. ఆ లోటును విజయ్ భర్తి చేస్తాడా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో విజయ్ నుంచి వచ్చిన సినిమాలతో పోల్చితే ఇది పక్కా కమర్షియల్ బిగ్గెస్ట్ మూవీగా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.