వెంకటేష్‌ అన్‌స్టాపబుల్‌ కామెడీ వైరల్‌

ఆ సమయంలో వెంకటేష్‌తో పాటు సురేష్ బాబు, అనిల్‌ రావిపూడి హీరోయిన్స్ సైతం షో లో సందడి చేశారు. ముఖ్యంగా వెంకటేష్ సందడి మామూలుగా లేదు.

Update: 2024-12-28 08:20 GMT

వెంకటేష్‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటేష్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో వెంకటేష్‌తో పాటు సురేష్ బాబు, అనిల్‌ రావిపూడి హీరోయిన్స్ సైతం షో లో సందడి చేశారు. ముఖ్యంగా వెంకటేష్ సందడి మామూలుగా లేదు.

అన్‌స్టాపబుల్‌ వెంకటేష్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. కామెడీతో నవ్వు తెప్పించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచే విధంగా వెంకటేష్ టాక్‌ షోలో బాలయ్యతో సందడి చేశారు. ముఖ్యంగా అన్నయ్య సురేష్ బాబుతో కలిసి వచ్చిన సమయంలో వెంకటేష్ సరదా ముచ్చట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక అనిల్‌ రావిపూడి వచ్చిన తర్వాత ఎపిసోడ్‌ మరింతగా హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా ఎపిసోడ్‌ మొత్తం వినోదాల విందుగా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలోని ఐకానిక్ కామెడీ సీన్‌ను రీ క్రియేట్‌ చేయడం ద్వారా నవ్వులు తెప్పించారు.

ఎవర్ గ్రీన్‌ కామెడీ సీన్‌తో బాలకృష్ణ ముందు వెంకటేష్ నవ్వులు తెప్పించిన విధానం ప్రతి ఒక్కరికీ నచ్చింది. ముఖ్యంగా వెంకటేష్ హావభావాలు అందరిని ఆకట్టుకున్నాయి. వెంకటేష్ ఈ వయసులోనూ అదే ఉత్సాహం, అదే కామెడీ టైమింగ్‌ తో భలే నవ్విస్తున్నారు అంటూ చాలా మంది ఎపిసోడ్‌ చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బాలకృష్ణ తో వెంకటేష్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్‌ ఈ సీజన్‌లోనే స్పెషల్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది.

ఇక సినిమా విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌కి సరైన సినిమా అంటూ ఈ సినిమా ప్రమోషన్‌ స్టఫ్ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. సోషల్‌ మీడియాలో ఎంత కావాలో అంత స్థాయిలో ప్రమోషన్‌ చేస్తున్నారు. ఈ స్థాయిలో సినిమాను ప్రమోట్‌ చేయడం కేవలం అనిల్‌ రావిపూడికి మాత్రమే చెల్లింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్‌లకు రప్పించడం ఖాయం. దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ఈ సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉండబోతుంది. బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ దక్కించుకుంటున్న అనిల్‌ రావిపూడికి మరో హిట్‌ పడటం ఖాయం.

Tags:    

Similar News