బోయ‌పాటి నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్సైపోయిందా!

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కు చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిక్ గానే బోయ‌పాటిని ఇద్ద‌రి ఇమేజ్ కి తగ్గ స్టోరీ సిద్దం చేయ‌మ‌ని చెప్పేసారు.

Update: 2024-12-27 22:30 GMT

బోయ‌పాటి త‌దుప‌రి చిత్రం కూడా క‌న్ప‌మ్ అయిన‌ట్లేనా? అదీ నంద‌మూరి న‌ట‌సింహంతోనే ఉండ‌బోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. కాక‌పోతే ఇందులో కాస్త మార్పు రాబోతుంది. బాల‌య్య‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కు చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్లిక్ గానే బోయ‌పాటిని ఇద్ద‌రి ఇమేజ్ కి తగ్గ స్టోరీ సిద్దం చేయ‌మ‌ని చెప్పేసారు.

ఇంత గొప్ప అవ‌కాశం కేవ‌లం బోయ‌పాటి కి మాత్ర‌మే చిరంజీవి అందించారు. ఎంతో మంది డైరెక్ట‌ర్లు ఉన్నా? వాళ్లంద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి ఆ ఛాన్స్ నీదే అంటూ ప‌బ్లిక్ గా చెప్పారు. మ‌రి ఈ ఛాన్స్ బోయ‌పాటి ఎందుకు వ‌దులు కుంటాడు? బాల‌య్య‌కే కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన బోయ‌పాటి ఆ ఇద్ద‌ర్నీ తెర‌పై చూపించ‌డానికి ఇంకే స్థాయిలో క‌స‌ర‌త్తులు చేస్తాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి మాస్ ఇమేజ్ కి త‌గ్గ స్టోరీ సిద్దం చేయ‌డం అంత సుల‌భం కాదు.

దీనిపై బోయ‌పాటి చాలా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే 'అఖండ తాంవ‌డం' త‌ర్వాత ఈప్రాజెక్ట్ పై బోయ‌పాటి ప‌ని మొద‌లు పెడ‌తార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా 'అఖండ తావ‌డం' మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ లో ఉంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాల‌న్న‌ది బోయ‌పాటి ప్లాన్ . ఇంత‌వ‌ర‌కూ ఆ కాంబినేష‌న్ ఫెయిలైంది లేదు. సింహా, లెజెండ్, అఖండ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ న‌మోదు చేసారు.

'అఖండ తాండ‌వం'తో నాల్గ‌వ హిట్ ఇచ్చి డ‌బుల్ హ్యాట్రిక్ లైన్ వేయాల‌ని చూస్తున్నారు. అఖండ తావ‌డం షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. అనంత‌రం బోయ‌పాటి చిరు-బాల‌య్య ప్రాజెక్ట్ ప‌నులు మొద‌లు పెట్టే అవ‌కాశం ఉంది. అటుపై చిత్రాన్ని 2026లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News