ఎక్కడైనా ట్యాలెంట్ ఉన్నోడికి అదో శాపం!
తాజాగా ఇదే విషయాన్ని వెటరన్ నటి విజయశాంతి సినిమా..రాజకీయ రంగంలో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
అన్ని రంగాల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. కానీ వాళ్ల పైనున్న వారు మాత్రం అందరూ ప్రతిభా వంతులు కాదు. అక్షరం ముక్క లేకపోయినా అజమాయిషీ చెలాయించే వారెక్కువ? అన్నది చాలా మంది నిపుణలు మాట. చెట్టు పేరు..కొమ్మ పేరు చెప్పుకుని కాలం వెళ్లదీయడం తప్ప! అలాంటి వారు జీవితంలో అంతకు మించి పైకి ఎదగరని మానసిక నిపుణలు చెబుతుంటారు. ప్రతిభ గల వాడు ఆ స్థానానికి చేరుకోవడానికి సమయం పట్టినా? ఒక్కసారి రీచ్ అయినా తర్వాత? అతడు చేరుకునే హైట్స్ ఊహించని విధంగా ఉంటాయంటారు.
తాజాగా ఇదే విషయాన్ని వెటరన్ నటి విజయశాంతి సినిమా..రాజకీయ రంగంలో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. 'అమితాబచ్చన్, రజనీకాంత్ తర్వాత ఆరోజుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంది నేనే. కోటి రూపాయలు అప్పట్లోనే పారితోషికం తీసుకున్నా. కానీ ఎదిగేవారిని చూసి పక్కనున్న వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓర్చుకో లేకపోయేవారు. ఏదో విధంగా రాజకీయాలు చేయాలని చూసేవారు.
ఈ రాజకీయం అన్నది నాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అలవాటు కాలేదు. సినిమా ఇండస్ట్రీలో ఉండగానే రాజ కీయాలు ఎలా చేస్తారో తెలుసుకున్నాను. రాజకీయం ..సినిమా రెండు రంగాల్లోనూ ఎదిగే వారిని చూస్తే పక్కనున్న వాడికి అసూయ పుడుతుంది. ట్యాలెంట్ ఉన్న వాళ్లకు అదో శాపం లాంటింది. అలా ట్యాలెంట్ లేని వాళ్లు అంతా ట్యాలెంట్ ఉన్న వాడిని ఎలా కిందకు పడగొట్టాలా? అని ఆలోచన చేస్తుంటారు.
ఆ రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అది ఎంతో కాలం చెల్లదు. సినిమా , రాజకీయం రెండు రంగాల్లోనూ ఇలాంటి వారిని చూసాను' అన్నారు. సినిమాల్లో ఓవెలుగు వెలిగిన తర్వాత విజయశాంతి రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఏరంగమైనా ఎదిగి చూపించడం అన్నది రాములమ్మ ప్రత్యేకత. ఇప్పటికీ అప్పు డప్పుడు వెండి తెరపైనా మెరుస్తున్న సంగతి తెలిసిందే.