`ఆర్ ఆర్ ఆర్`.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరిది. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఇది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని తీరితో రూపొందిన ఈ మూవీ బిజినెస్ పరంగానూ చరిత్రని తిరగరాసింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఏకంగా 890 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం టాలీవుడ్ సినీ హిస్టరీలోనే తొలిసారి కావడంతో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. భారీ అంచనాల మధ్య జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా మారిన పరిస్థితులు, ఒమిక్రాన్, కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమల్లోకి వచ్చేశాయి.
దీంతో `ఆర్ ఆర్ ఆర్` ని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించేసింది. దీంతో షాక్ కు గురైన ప్రేక్షకులకు రాజమౌళి ఓ సర్‌ప్రైజ్ ని సిద్ధం చేశాడట. దాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయకుండా సీక్రెట్ గా దాచేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేశారట. ఈ పాటని సైలెంట్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై కొన్ని వారాల క్రితమే చిత్రీకరించారని తెలిసింది. ఈ ప్రత్యేక గీతం `మగధీర` ఎండ్ టైటిల్స్ లో టీమ్ మెంబర్స్ అందరితో కలిసి ఏర్పాటు చేసినట్టుగా `ఆర్ ఆర్ ఆర్` సినిమా ముగింపులో వస్తుందని,అయితే ఈ పాటలో కేవలం రామ్ చరణ్ , ఎన్టీఆర్ మాత్రమే వుంటారని చెబుతున్నారు.
ఈ పాటని చివరి వరకు సర్ ప్రైజింగ్ గా దాచేసి థియేటర్ లో మాత్రమే ఆడియన్స్ కి చూపించి వారిని సర్ ప్రైజ్ చేయాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ డ్యాన్సింగ్ స్టెప్పులతో అదరగొట్టేశారని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీ రిలీజ్ జనవరి 7న అయితే ప్రత్యేకంగా షూట్ చేసిన పాటని విడుదల చేయాలని ప్లాన్ చేశారట. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పాట ని సీక్రెట్ గా అలాగే దాచేయాలని రాజమౌళి భావిస్తున్నారని చెబుతున్నారు.
ఇదిలా వుంటే మూడేళ్లుగా ఈ సినిమా కోసం శ్రమించి తీరా విడుదల వాయిదా పడేసరికి హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా పడటంతో వేస్టయిన సమయాన్ని కవర్ చేసుకునే పనిలో ఇప్పుడు ఇద్దరు హీరోలు బిజీగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్.. శంకర్ సినిమా పనుల్లో నిమగ్నం కాగా.. ఎన్టీఆర్.. కొరటాల సినిమా కోసం రెడీ అయిపోతున్నారు.