స‌ల్మాన్ ఖాన్ ఆ భ‌యం వ‌ల్లే టైటిల్ మార్చేశాడా?

Update: 2022-09-05 09:34 GMT
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న భారీ మూవీ 'క‌భీ ఈద్ క‌భీ దివాలీ'. ఫ‌ర్హ‌ద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. త‌మిళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'వీరం' ఆధారంగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్‌, సాజిద్ న‌దియా వాలా సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. త‌మిళ హిట్ ఫిల్మ్ 'వీరం' ఆధారంగా తులుగులో 'కాట‌మ రాయుడు' పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేసిన విష‌యం తెలిసిందే.

స‌ల్మాన్ ఖాన్ మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 1993లో 'చంటి' ఆధారంగా రీమేక్ అయిన 'అనారి'తో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన వెంక‌టేష్ ఆ త‌రువాత 1995లో కె. ముర‌ళీమోహ‌న్ రావు ద‌ర్శ‌క‌త్వంలో 'య‌మ‌లీల‌' ఆధారంగా తెర‌కెక్కిన హిందీ 'త‌క్‌దీర్ వాలా'తో మ‌రోసారి బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స‌ల్మాన్ ఖాన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ మూవీలోని ఓ ప్ర‌ధాన పాత్ర‌లో జ‌గ్గూభాయ్ జ‌గ‌ప‌తి బాబు కూడా న‌టిస్తున్నఈ మూవీ టైటిల్ ని తాజాగా మ‌రోసారి మార్చేశారు. ముందు ఈ మూవీకి 'భాయిజాన్‌' అనే టైటిల్ ని పెట్టాల‌నుకున్నార‌ట‌. కానీ అది ఎందుకో ప‌క్క‌న పెట్టేశార‌ట‌. వెంక‌టేష్ ని ఉద్దేశించే ఆ టైటిల్ వుంటుంద‌నే ఆ పేరుని ప‌క్క‌న పెట్టిన టీమ్ ఆ త‌రువాత 'క‌భీ ఈద్ క‌భీ దివాలీ'ని ఫైన‌ల్ చేశారు. అయితే తాజాగా ఆ పేరుని కూడా ప‌క్క‌న పెట్టి 'కిస్ కా భాయ్ కిస్ కా జాన్‌' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు.

ఇందుకు సంబంధించిన లేటెస్ట్ వీడియోని హీరో స‌ల్మాన్ ఖాన్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా సోమ‌వారం షేర్ చేయ‌డం విశేషం. ఎడారిలో లాంగ్ హెయిర్ తో డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో న‌డుచుకుంటూ వెళుతున్న వీడియోని విడుద‌ల చేశాడు.

ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఉన్న‌ట్టుండి స‌ల్మాన్ ఖాన్ త‌న సినిమా టైటిల్ ని మార్చేసి 'కిస్ కా భాయ్ కిస్ కా జాన్‌' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ముందు ఖ‌రారు చేసిన 'క‌భీ ఈద్ క‌భీ దివాలీ' టైటిల్ కార‌ణంగా వివాదం త‌లెత్తే అవ‌కాశం వుంద‌ని, అంతే కాకుండా బాయ్ కాట్ ట్రెండ్ భ‌యం వెంటాడ‌టం వ‌ల్లే స‌ల్మాన్ 'క‌భీ ఈద్ క‌భీ దివాలీ' టైటిల్ ని ప‌క్క‌న పెట్టి 'కిస్ కా భాయ్ కిస్ కా జాన్‌' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీలో వెంక‌టేష్ హీరోయిన్ పూజా హెగ్డేకు అన్న‌గా క‌నిపించ‌నున్నారు. 'కేజీఎఫ్' సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బాస్రూర్ నేప‌థ్య సంగీతం అందిస్తుండ‌గా ఓ పాట‌కు దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.




Full ViewFull View
Tags:    

Similar News