నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత బాలీవుడ్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. తెలుగు సినిమాలు చేస్తున్నా తుదిగా స్థిరపడేది ముంబైలోనేని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వదిలి ముంబైకి మకారం మార్చస్తుందని మీడియా కథనాలు హీటెక్కించాయి. బాలీవుడ్ సెలబ్రిటీ కాలనీలో సమంతల ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలు గుప్పుమన్నాయి.
అధికారికంగా హైదరాబాద్ లో ఉన్నా అనధికారికంగా ముంబైలోనే ఎక్కువగా ఉంటుందని...అవసరం మేర చెన్నై వెళ్లి వస్తుందని..చెన్నై టూ ముంబై ప్రాంతాలకే ఎక్కువగా తిరుగుతుందని ఒకటే ప్రచారంతో సమంత పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి చైతన్యకి దూరమైన తర్వాత సమంత గచ్చిబౌలిలో ని లో అపార్ట్ మెంట్ లో కొన్నాళ్ల పాటు ఉన్నారు.
అటుపై చెన్నై వెళ్లి అక్కడ నుంచి నేరుగా ముంబై కార్యకలాపాలు మొదలు పెట్టినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తాజాగా ఇప్పుడు సమంత మకాం పూర్తిగా ముంబై కి మార్చేసినట్లు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లగేజీతో సహా సమంత ముంబైకి అనధికారికంగా షిప్ట్ అయిందని..మీడియాకి ఎలాంటి లీకులు లేకుండా ప్రీ ప్లాన్డ్ గా ముంబైకి వెళ్లిపోయిందని అంటున్నారు.
ప్రస్తుతం సమంత హిందీలో ఓ వెబ్ సిరీస్ తో పాటు..ఓ సినిమాకి కూడా కమిట్ అయింది. ఈ రెండు ప్రాజలెక్ట్ లు పూర్తిచేయాలంటే ముంబైలోనే ఉంటే తప్ప వీలుపడదని నిర్మాణ సంస్థలు సూచించడంతో వెను వెంటనే సామ్ ముంబైకి షిప్ట్ అయినట్లు గుస గుస వినిపిస్తుంది. ఖాళీ సమయం ఉంటే మాత్రం హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలు చూసుకోవడానికి వస్తుందని తెలుస్తోంది.
ప్లేస్కూల్..ఆపెరల్ సేల్స్.. ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీల పర్య వేక్షణకు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తుందిట. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. షూట్ లో భాగంగా సమంత ముంబై-కశ్మర్ ప్రయాణం ఎక్కువగా జరిగినట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది.
అలాగే 'యశోద'..'శాకుంతలం' లేడీ ఓరియేంటెడ్ చిత్రాల షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసింది. యశోద తుది మొరుగుల్లో భాగంగా అప్పుప్పుడు చెన్నై వెళ్తున్నట్లు తెలిసింది. మొత్తంగా సమంత దాదాపు హైదరాబాద్ ని వదిలేసి దూరంగా ఉంటున్నట్లు క్లారిటీ వస్తుంది. ఇలాంటి దూరం మనసుకు తగిలిన గాయాన్ని కొంచమైనా తగ్గించే అవకాశం లేకపోలేదు. అదీ ఓ కారణంగా సమంత ముంబై షిప్టింగ్ వెనుక ఉండొచ్చు అన్నది కొంత మంది వాదన.