బాలీవుడ్ బ్యాడ్ బాయ్ షాహిద్ కపూర్ మాజీ ప్రియురాల జాబిత తీస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఆయన తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ కాకుండా ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేశాడంటూ వార్తలు వచ్చేవి. షాహిద్ కపూర్ ఎంతో మందితో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని ఎన్ని లవ్ స్టోరీల విషయంలో ఆయన సీరియస్ గా ఉన్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కొందరిని ఆయన లైట్ తీసుకుంటే.. కొందరు ఆయన్ను లైట్ తీసుకున్నారు అంటూ బాలీవుడ్ వర్గాల టాక్. కాని విద్యా బాలన్ మాత్రం ఆయన్ను మనసారా ప్రేమించిందని.. కాని అతడి మాట తీరు వల్ల ఆమె తీవ్రంగా బాధ పడి అతడికి దూరం అయ్యిందని బాలీవుడ్ మీడియా టాక్
విద్యాబాలన్ మరియు షాహిద్ కపూర్ లకు సిస్మత్ కనెక్షన్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మద్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంను మరో స్టెప్ తీసుకు వెళ్లాలని ఇద్దరు కూడా భావించారని.. సినిమా తర్వాత కూడా ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారట. ఎంతో ప్రేమగా ఉన్నా కూడా విద్యా బాలన్ ను పదే పదే అవహేళన చేసినట్లుగా మాట్లాడేవాడట. ముఖ్యంగా విద్యా బాలన్ బరువు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమెకు చాలా బాధను కలిగించేవట. ఒక్క సారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు ఆమె మనసు నొప్పించే విధంగా ఆయన మాట్లాడటం వల్లే ఈ రిలేషన్ షిప్ కంటే ఆత్మాభిమానం ముఖ్యం అని ఆమె బ్రేకప్ చెప్పిందట.
గతంలో ఇద్దరి మద్య వ్యవహారం మరియు బ్రేకప్ గురించి మాట్లాడాల్సిందిగా పదే పదే మీడియా వారు వారిని కోరడం జరుగుతూనే ఉంది. కాని ఇద్దరిలో ఇప్పటి వరకు ఎవరు కూడా డైరెక్ట్ గా ఒకానొక సమయంలో ప్రేమలో ఉన్నా... ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యామని మాత్రం చెప్పడం లేదు. బొద్డు గుమ్మ విద్యా బాలన్ మాత్రం ఆయన ప్రస్థావన వచ్చిన సమయంలో కాస్త మానసిక వేదనతో సమాధానాలు చెప్పడం గమనించాం అని... షాహిద్ కపూర్ మాత్రం విద్యా బాలన్ గురించి చాలా లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడుతాడు అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల వారి కామెంట్స్.