మురుగ‌దాస్ మార్చేసాడా?

Update: 2022-07-31 02:30 GMT
కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. చివ‌రిగా  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో 'ద‌ర్బార్ 'చిత్రాన్ని తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆ సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ 'అన్నాథై' తో మ‌రో హిట్ ఖాతాలో వేసుకున్నారు. కానీ మురుగ‌దాస్ మాత్రం  ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు.

అయితే త‌ల‌ప‌తి విజ‌య్ తో సినిమా చేస్తున్న‌ట్లు..స్ర్కిప్ట్ లాక్ అయిన‌ట్లు  తెర‌పైకి వ‌చ్చినా ఇప్ప‌టివ‌ర‌కూ అదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. వేర్వేరు ద‌ర్శ‌కుల‌తో విజ‌య్ సినిమా చేస్తున్నాడు త‌ప్ప మురుగ ప్రాజెక్ట్ గురించి ఆయ‌న ఏ సంద‌ర్బంలోనూ  రివీల్ చేయ‌లేదు.  తాజ‌గా మ‌రుగ‌దాస్ కొత్త సినిమా ఖ‌రారు అయిన‌ట్లు  కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

శింబు హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు ముగిసాయ‌ని.. త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంద‌ని వినిపిస్తుంది. అలాగే ఈచిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా  తెర‌కెక్కిస్త‌న్న‌ట్లు లీకులందుతున్నాయి. ఇంతవ‌ర‌కూ మురుగదాస్ కి  పాన్ ఇండియా సినిమా లేదు. ఈ వార్త నిజ‌మేతే ఇదే తొలి పాన్ ఇండియా అవుతుంది.

అయితే ఈ స్ర్కిప్ట్ విజ‌య్ కోసం సిద్దం చేసిందా?  శింబు  ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని సిద్దం చేసిందా? అన్న‌ది సందేహంగా మారింది.  విజ‌య్ డేట్లు కేటాయించ‌డంలో ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో మురుగ‌దాస్ శింబుతో అదే స్ర్కిప్ట్ తో ముందుకెళ్తున్న‌ట్లు కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తోంది. అయితే  విజ‌య్-శింబు ఇమేజ్ మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది.

విజ‌య్  కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక‌రు. అత‌ను టైర్-1 హీరో.  శింబు ఇంకా టైర్ -1 రీచ్ అవ్వ‌లేదు. ప‌రిమిత బ‌డ్జెట్ లోనే సినిమాలు చేస్తున్నారు. అదీ చాలా రేర్. ఇప్పుడిప్పుడే శింబుశ‌ర‌న్ కెరీర్ గ్రాఫ్ మెరుగుప‌డుతుంది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా రెండు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఒక‌టి సెప్టెంబ‌ర్ లో..మరొక‌టి డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతున్నాయి.

మ‌రి శింబు-మురుగ‌దాస్ ప్రాజెక్ట్ అధికారిక‌మైతే శింబు రేంజ్ మారిన‌ట్లే. ముర‌గ‌దాస్ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ . ఆయ‌న ఎలాంటి క‌థ తీసుకున్నా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉంటుంది. అలాగే ముర‌గ‌దాస్ వ‌ద్ద స్టోరీల బ్యాంక్ స్టోరేజ్ ఉంటుంది. ఇంత వ‌ర‌కూ ఒక హీరో కోసం సిద్దం  చేసిన క‌థ‌ని మ‌రో హీరోతో తెర‌కెక్కించింది లేదు.

హీరో ఇమేజ్ ని బేస్ చేసుకుని ఆయ‌న క‌థ‌లు రెడీ అవుతుంటాయి.  అయితే ఈసారి విజ‌య్ అశ్ర‌ద్ద కార‌ణంగా అదే క‌థ‌లోకి శింబుని తీసుకొచ్చి మురుగ‌దాస్  ప్రెస్టీజియ‌స్ గా తీసుకున్న‌ట్లు ఓ వార్త వినిపిస్తుంది. మ‌రి అస‌లు సంగతేంటి? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    

Similar News