స్టార్ హీరో తన మూవీని రిస్కులో పెట్టుకున్నాడా..??

Update: 2021-03-10 02:30 GMT
తెలుగు ఇండస్ట్రీలోకి ఎందరో పక్క రాష్ట్రాల హీరోలు డబ్బింగ్ సినిమాలతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళం నుండి చాలామంది హీరోలు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే వారి ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒకటే రీసన్.. తెలుగు ప్రేక్షకులు సినిమాలో మేటర్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారు. ఏ హీరోనైనా స్వాగతిస్తారు అనేది అందరికి తెలిసిన బలమైన విషయం. కానీ పక్క రాష్ట్రాలలో నుండి తెలుగులో అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారిని కామెంట్ చేస్తే మాత్రం ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాడట కన్నడ స్టార్ హీరో దర్శన్.

ఆయన హీరోగా రాబర్ట్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శన్ కెరీర్లో ఫస్ట్ టైం తెలుగులోకి ఓ సినిమా డబ్ చేస్తున్నాడు. అలాగే తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా రాబర్ట్ విడుదల కాబోతుందట. ఆ విషయం పక్కనపెడితే.. రాబర్ట్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పలు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో దర్శన్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడాడని.. అలాగే కొన్ని నెగటివ్ కామెంట్స్ చేసాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనక నిజమైతే.. తెలుగులో దర్శన్ సినిమా పరిస్థితి ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఆ వీడియోస్ అన్ని ఫేక్ అని దర్శన్ అభిమానులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని టాక్. మరి చూస్తుంటే రాబర్ట్ సినిమా విషయంలో ఎలాంటి రిజల్ట్స్ రానున్నాయో అని ఆద్యంతం ఆసక్తికరంగా మారింది వాతావరణం. చూడాలి మరి రాబర్ట్ సినిమాకు తెలుగు జనాలు ఏ విధంగా న్యాయం చేస్తారో!




Tags:    

Similar News