మెగా క్యాంప్ నిర్లక్ష్యం చేసిందా ?

Update: 2019-02-26 01:30 GMT
ఇప్పుడు సోషల్ మీడియాలో నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ గా ఫిక్స్ చేసుకోవడం మీదే ఎక్కువ చర్చ నడుస్తోంది. న్యాచురల్ స్టార్ ఇమేజ్ కు ఇది సూట్ కాదని గ్యాంగ్ లీడర్ అంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మాత్రమే అని వీలైనంత త్వరగా టైటిల్ మార్చమని మెగా ఫ్యాన్స్ బాగానే రచ్చ చేస్తున్నారు. ఇదంతా పెద్దగా ఫలితం ఇచ్చే తతంగం కాదు కాని టైటిల్ విషయంలో మెగా క్యాంపు కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దాని ప్రకారం గ్యాంగ్ లీడర్ టైటిల్ ని గీత ఆర్ట్స్ లేదా కొణిదెల సంస్థ పేరు మీద ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఎవరూ వాడుకునే అవకాశం ఉండేది కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా రామ్ చరణ్ తో ఇలాంటి కథ దొరికినప్పుడు దీన్ని వాడేసుకుంటే మార్కెట్ పరంగా ఇమేజ్ పరంగా ప్లస్ అయ్యేది. కాని అదేమి జరగలేదు. ఫలితంగా ఐకానిక్ టైటిల్ వేరే వాళ్లు వాడేసుకున్నారు అని అభిమానులు బాధ పడే పరిస్థితి వచ్చింది

ఇంత రచ్చ జరిగితే మెగా కాంపౌండ్ దాకా వెళ్ళకుండా ఉంటుందా. అయితే అటువైపు నుంచి వేరే వెర్షన్ వచ్చిందట. ఇలా టైటిల్స్ ని కాపాడుకోవడం కోసమే డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్టర్ చేసుకునే పనైతే చిరు 150 సినిమాల్లో ఎంత లేదన్నా అలాంటివి యాభైకి పైగానే ఉన్నాయని మరి వాటిని ఎలా మేనేజ్ చేయాలనీ ప్రశ్నించారట. నిజమే అందులో లాజిక్ ఉంది. ఘరానా మొగుడు-ఖైది-కొదమసింహం- దొంగ- రాక్షసుడు-ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటిని అదే పనిగా రిజిస్టర్లు రెన్యువల్స్ చేయిస్తూ కూర్చోవడం జరిగే పని కాదు. ఇదంతా పక్కన పెడితే నాని గ్యాంగ్ లీడర్ గా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి మెంటల్ ప్రిపేర్ అయిపోయి దాని ఫలితం కోసం ఎదురు చూడటం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏమి లేదు
    

Tags:    

Similar News