'సినిమా అనే కాదు.. ఏ విషయంలోనూ ఎగిరెగిరి పడోద్దు..ఇలా చేస్తే ఎదురు దెబ్బలే తగులుతాయి' సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్న మాటలివి. 'లైగర్' వివాదం సందర్భంలో భరద్వాజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అన్న మాటలు ఓ యంగ్ హీరో చూపిస్తున్న యాటిట్యూడ్ కి సరిగ్గా సరిపోతున్నాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా ఓ యంగ్ హీరో తను నటిస్తున్న సినిమాలకు హీరోగా, రైటర్ గా వ్యవహరిస్తూ సదరు సినిమాల విజయాల్లో తన వంతు బాధ్యతను పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో సదరు యంగ్ హీరో నటిస్తూ రచనా సహకారం అందించిన ఓ మూవీ చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ని రీసెంట్ గా మొదలు పెట్టారు. షూటింగ్ మొదలైన దగ్గరి నుంచి ఈ ప్రాజెక్ట్ చుట్టూ వరుస వివాదాలు అలుము కుంటున్నాయి.
సదరు సినిమాకు దర్శకుడు మారడం నుంచి వరుసగా హీరోయిన్ లు కూడా మారుతూ వస్తున్నారు. దీంతో ఈ మూవీతో పాటు సదరు యంగహీరో కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తన వల్లే హీరోయిన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారని, అతని యాటిట్యూడ్ కారణంగా హీరోయిన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై హీరోతో పాటు చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే చిన్న సినిమాల్లో భారీ విజయాన్ని దక్కించుకోవడంతో సదరు యంగ్ హీరో తన యాటిట్యూడ్ ని చూపిస్తున్నాడట. రీసెంట్ గా ఓ పాపులర్ టీవీ షోకు గెస్ట్ గా రావాలని సదరు టెలివిజన్ సంస్థ సంప్రదించడంతో సదరు హీరో తాను రావాలంటే ఏకంగా ఒక పెద్ద హీరో రేంజ్ లో కొన్ని లక్షలు పారితోసికం కింద ఇవ్వాలని డిమాండ్ చేసి షాకిచ్చాడట. దీంతో పేరున్న యంగ్ హీరో లే అంత డిమాండ్ చేయకపోవడంతో సదరు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ వారు తమ ప్రయత్నాలని విరమించుకుని మరో హీరోని సంప్రదించారట.
ఎంత హిట్ వస్తే మాత్రం కేవలం 15 నిమిషాల కార్యక్రమానికి ఏకంగా లక్షలు డిమాండ్ చేయడం ఏంటి అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్ లు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో యాటిట్యూడా మజాకా అని కొంత మంది సదరు హీరోపై సెటైర్లు వేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.