సీనియర్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లని ప్రకటిస్తూ జోరు చూపిస్తున్నారు. కానీ ఒక్క హీరో మాత్రం ఇప్పటికీ కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. దీంతో ఏం జరిగుతోంది? ఆయన ఎందుకు కొత్త ప్రాజెక్ట్ ని అంగీకరించడం లేదనే చర్చ మొదలైంది. అయితే ఎట్టకేలకు తాను కూడా రేసులో వున్నానంటూ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 'ఎఫ్ 3' తరువాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు.
అయితే బాలీవుడ్ లో మాత్రం సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న 'కభీ ఈద్ కభీ దివాళీ'లో నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ 'వీరం' ఆధారంగా ఈ మూవీని సల్మాన్ ఖాన్, సాజిద్ నదియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం రానాతో కలిసి 'రానా నాయుడు' వెబ్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో 'రానా నాయుడు' పూర్తయింది.
అయినా వెంకటేష్ తెలుగు సినిమా అంగీకరించలేదు. అయితే తాజాగా శివ నిర్వాణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించబోతున్నారు.
ఈ ఏడాది చివర్లో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - సమంతల కలయకిలో 'ఖుషీ' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ తరువాత స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వెంకటేష్ కు పూర్తి కథని వినిపించనున్నారట. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారట. ఇదిలా వుంటే తమిళ హిట్ మూవీ 'ఓ మై కడవులే' ఆధారంగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ 'ఓరి దేవుడా!'.
దిల్ రాజు తో కలిసి పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీలోని విజయ్ సేతుపతి పాత్రలో వెంకటేష్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారట. ఇదిలా వుంటే రానాతో కలిసి విక్టరీ వెంకటేష్ నటించిన తొలి వెబ్ సిరీస్ 'రానా - నాయుడు' త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.