టాలీవుడ్ లో భరత్ అనే నేను.. వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బిజీ హీరోయిన్. కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో టాప్ స్టార్ గా మారిపోయిన ఈ అమ్మడు తాజాగా అక్షయ్ కుమార్ కు జోడీగా లక్ష్మీ బాంబ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కియారా అద్వానీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సందర్బంగా పలు విషయాలను వెళ్లడి చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా ఉన్న నెపొటిజంపై ఆమె స్పందిస్తూ సినిమా పరిశ్రమలో నా అనే వారు ఉన్నా కూడా నేను ఇండస్ట్రీలో పరిచయం అయ్యే వరకు వారి వద్దకు వెళ్లలేదని చెప్పింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మా అమ్మ నిర్వహించే చిన్న పిల్లల నర్సరీ స్కూల్ లో పని చేశాను. ఆ సమయంలో పిల్లల డైపర్లు మార్చడం నుండి మొదలుకుని వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చేదాన్ని. చిన్న పిల్లలు చాలా నిజాయితీగా ఉంటారు. అదే నాకు నచ్చుతుంది. అందుకే వారికి ఏమైనా చేయాలనిపిస్తుంది.
సినిమాల్లో ఆఫర్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాను. మొదటి ఆఫర్ కోసం ఎంత కష్టపడ్డానో ఆ తర్వాత కూడా చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుండి వెళ్లి జాబ్ చేసుకోవాలన్నంత ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా అదృష్టం కొద్ది మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా అయ్యానంటూ కియారా చెప్పుకొచ్చింది.