రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత ఫుల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొత్త సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కీలక భాగంలో కొంత పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసారు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం వస్తున్న వార్తలు మాత్రం మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. వాటి ప్రకారం చెర్రీకి బోయపాటికి మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. కారణం ఏంటి అనేది పక్కాగా తెలియనప్పటికీ మేకింగ్ విషయంలో వచ్చిన అభిప్రాయభేదాలే అని తెలిసింది. చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ తో భారీ ఖర్చుతో ఇది రూపొందుతుండంతో ఇప్పటిదాకా ప్లాన్ చేసిన షెడ్యూల్స్ లో రోజుకు 25 లక్షల దాకా ఖర్చు ఉంటోందట. ఇంతా చేసి కీలకమైన ఆర్టిస్టులు ఆ సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఖర్చు వృధా అవుతోందని నిర్మాత డివివి దానయ్యతో సైతం బోయపాటికి విభేదాలు ఉన్నాయని తెలిసింది.
ఇందులో నిజం పాలెంతో అధికారికంగా తెలిసే అవకాశం లేదు కానీ రెగ్యులర్ గా ఒక ఫ్లో ప్రకారం జరగాల్సిన షూటింగ్ మధ్య మధ్యలో గ్యాప్ రావడం చూస్తే అనుమానం రాక మానదు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని టీమ్ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే అది వాయిదా పడే అవకాశం కూడా ఉందని వినికిడి. ఇది మెగాస్టార్ దృష్టికి వెళ్లిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది కాకుండా దానయ్యకు చరణ్ తో మరో కమిట్మెంట్ ఉంది. రాజమౌళి తీయబోయే మల్టీ స్టారర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా హీరో. ఈ నేపథ్యంలో బయటికి వస్తున్న ఇలాంటి వార్తలు అభిమానులను కలవరానికి గురి చేయడం సహజం.
ఈ లెక్కన బోయపాటి అటు చరణ్ తో ఇటు దానయ్యతో ఏకకాలంలో కోల్డ్ వార్ చేస్తున్నాడన్న మాట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్ అన్నయ్యలు గా సీనియర్ హీరోలు ప్రశాంత్-ఆర్యన్ రాజేష్ లు కనిపిస్తారు. ఎవడు-నాయక్ తరహాలో సంక్రాంతి సెంటిమెంట్ దీనికి కూడా వర్క్ అవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు ఫాన్స్.