#RRR: చరణ్ కు ఛాలెంజింగ్ పాత్ర!

Update: 2019-02-15 09:14 GMT
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం #RRR షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు సంబంధించిన  అప్డేట్స్ పట్ల ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి వ్యక్తం అవుతోంది.  అలా అని అధికారికంగా అప్డేట్స్ రావడం లేదుకానీ అప్డేట్స్ ప్రవాహం మాత్రం ఆగడం లేదు.  తాజగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది.

ఈ సినిమాలో చరణ్ కోసం ఒక ఛాలెంజింగ్ పాత్రను డిజైన్ చేశారట రాజమౌళి.  ఇప్పటివరకూ చరణ్ ఎప్పుడు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్ర ను పోషించలేదట.  ఈ సినిమాలో చరణ్ పాత్రంకు మూడు విభిన్న పార్శ్వాలు ఉంటాయట.  బ్రిటిష్ ఆఫీసర్ గా.. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా.. ఒక మాస్ నాయకుడుగా.. ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడట చరణ్. ట్విస్ట్ ఇంతటితో ఆగలేదు.. చరణ్ పాత్రకు పాజిటివ్ షేడ్స్ తో పాటుగా నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట.  'రంగస్థలం'లో చిట్టిబాబుగా చెలరేగిపోయిన చరణ్ కు మరోసారి నటన విషయంలో పెద్ద టెస్ట్ పెట్టినట్టున్నాడు జక్కన్న. 

ఇదిలా ఉంటే #RRR షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది.  గత వారంరోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్సును చరణ్.. ఇతర ఫైటర్లపై తెరకెక్కిస్తున్నాడట.  ఈ ఎపిసోడ్ చరణ్ కు సంబంధించినది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారట.
Tags:    

Similar News