నటనలో కొనసాగినా చాలా మంది ఉన్నత విద్యను పూర్తి చేసాకే ఈ రంగంలోకి వచ్చామని చెబుతుంటారు. డాక్టర్లు లాయర్లు ఇంజినీర్లు ఎంబీఏ గ్రాడ్యుయేట్లు అయిన వాళ్లు కథానాయికలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదే కోవలో తాను కూడా సినీరంగంలో కొనసాగుతున్నానని చెబుతోంది దిగంగన సూర్యవంశీ. ఈ అమ్మడు ఇటీవలే సీటీమార్ చిత్రంలో కనిపించింది.
గోపీచంద్- తమన్నాల స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ లో చివరిసారిగా కనిపించిన ముంబై యువ నటి దిగంగనా సూర్యవంశీ తనకు నటనతో పాటు విద్యపైనా పూర్తి మక్కువ సమాన ఆసక్తి ఉందని తెలిపింది. ఇటీవల దిగంగన బిఏ - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
అయితే వృత్తిపరమైన కమిట్ మెంట్ ల కారణంగా డిగ్రీ పూర్తి చేయడానికి 3 సంవత్సరాలకు బదులుగా 5 సంవత్సరాలు పట్టిందట. ప్రస్తుతం ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరానని వెల్లడించింది. చిన్నతనం నుండి మంచి విద్యార్థినిని.. 7 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తన చదువులు నటనను రెండింటినీ విజయవంతంగా కొనసాగిస్తున్నానని తెలిపింది.
దిగంగన ప్రస్తుతం భారీ బడ్జెట్ బాలీవుడ్ హిస్టారికల్ మూవీ `ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్`లో నటిస్తోంది. తెలుగులో సీటీమార్ తర్వాత మరో సినిమాలో నటిస్తోంది.
అందం ప్రతిభ వాక్చాతుర్యం ఉన్న ఈ బ్యూటీకి మునుముందు చక్కని భవిష్యత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దిగంగన తన తొలి సినిమా హిప్పీలో కార్తికేయ సరసన నటించింది. తెలుగు -తమిళం ద్విభాషా చిత్రంగా వచ్చిన ఈ మూవీలో జేడీ చక్రవర్తి విలన్ గా నటించారు.