శ్రీకాకుళం నుంచి ఎల్.వి.రేవంత్ ఇండియన్ ఐడల్ లో విజేతగా నిలిచాడు. ఎక్కడో మారు మూల గ్రామాల నుంచి కూడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎన్నో వేదికలు సిద్ధంగా ఉన్నా కానీ దానిని అందిపుచ్చుకునేది ఎందరు? అన్నదే ప్రశ్నగా మారింది. బుల్లితెరతో పాటు ఇప్పుడు ఓటీటీలు కూడా ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. డిజిటల్ మాధ్యమంలో గాయనీగాయకుల సంపాదనకు అవకాశ మార్గాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెజాన్ లాంటి దిగ్గజం ఇలాంటి అవకాశం కల్పించేందుకు ముందుకు రావడం సరికొత్త పంథాను చూపెడుతుందనడంలో సందేహం లేదు.
తెలుగు యువతలో బోలెడంత ట్యాలెంట్ ఉన్నా గాయనీగాయకులు ఎందరు ఉన్నా కానీ బయటికి వెలుగు చూడని ప్రతిభగానే మిగిలిపోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రచార మాధ్యమాలు పెరుగుతున్నాయి. ఏదో ఒక వేదికపై క్లిక్కయితే డిజిటల్ వరల్డ్ లోనే బోలెడంత సంపాదనా మార్గం సాధ్యపడుతోంది.
తాజాగా అమెజాన్ అలెక్సా ఒరిజినల్స్ పరిచయంతో స్వతంత్ర సంగీత కళాకారులకు ఈ వేదిక వరంగా మారనుందని భావిస్తున్నారు. కార్పొరెట్ దిగ్గజం ప్రతిభావంతులైన గాయనీగాయకులకు అవకాశాలు కల్పిస్తూ సంపాదనా మార్గాన్ని క్రియేట్ చేయనుంది.
భారతదేశానికి చెందిన నలుగురు స్వతంత్ర కళాకారులచే ప్రత్యేకమైన కొత్త పాటల ఎంపిక అయిన అలెక్సా ఒరిజినల్స్ ను అమెజాన్ ప్రారంభించినట్లు ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు అలెక్సా ఒరిజినల్స్ లో భాగంగా లిసా మిశ్రా రచించిన బేసాబర్- విభా సరాఫ్ నుండి బిఖ్రే.. సాథి- గుల్‌రాజ్ సింగ్ నుండి ఇన్ స్ట్రుమెంటల్ ట్రాక్ .. అలానే డైస్ బీ రాసిన డౌన్ టౌన్ పాటలను వినేందుకు అందుబాటులో ఉంచింది.
స్మార్ట్ ఫోన్ లు.. అమెజాన్ షాపింగ్ యాప్ (ఆండ్రాయిడ్ మాత్రమే).. ఎకో స్మార్ట్ స్పీకర్లు .. HP ల్యాప్ టాప్ ల వంటి ఇతర బ్రాండ్ ల సాయంతో అనేక అలెక్సా అంతర్నిర్మిత పరికరాలతో అలెక్సా యాప్ లో అన్ని పాటలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అలెక్సా ఒరిజినల్స్ లోని పాటలను లిసా మిశ్రా ( గాయని పాటల రచయిత్రి) వంటి స్వతంత్ర సంగీత కళాకారులు స్వరపరిచారు.. వారే పాడారు. ముఖ్యంగా బాలీవుడ్ పాటల రీమిక్స్ కల్చర్ తో పాపులరైన గుల్ రాజ్ సింగ్,.. సినీ సంగీత దర్శకుడు .. గాయకుడు విభా సరాఫ్ మెలోడీలను రూపొందించడంలో పాపులరయ్యారు. ఇతర గాయనీగాయకులు ప్రతిభలో నిరూపించుకుని ఈ వేదికపై సత్తా చాటేందుకు విచ్చేసారు.
భారతదేశంలో అలెక్సా ప్రారంభించినప్పటి నుండి సంగీతం వినడం అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటి. ప్రతిరోజూ 21.6 లక్షల పాటలను ప్లే చేయమని అలెక్సాలో డిమాండ్ నెలకొందిట. అలెక్సా ఒరిజినల్స్ ద్వారా దేశంలోని మిలియన్ల మంది అలెక్సా వినియోగదారులకు సంగీతాన్ని అందించడం ద్వారా ఈ స్వతంత్ర కళాకారులను మరింత ప్రోత్సహించాలన్నది ప్లాన్. ఎగ్జయిట్ చేసే గాయనీగాయకుల కోసం అలెక్సా వేచి చూస్తోంది. డిజిటల్ మాధ్యమంలో మరిన్ని అవకాశాల కల్పనకు ప్రయత్నిస్తోంది.అలెక్సాతో కలిసి పనిచేసిన మొదటి కొద్దిమందిని కూడా ప్రోత్సహించారు. అలెక్సాను కొత్త మిలీనియల్ మ్యూజిక్ ప్లాట్ ఫారమ్ గా చూడడానికి చాలా సంతోషిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
శ్రీకాకుళం -కాకినాడ-రాజమండ్రి లేదా తెలంగాణలోని ఏదైనా మారుమూల నుంచి ప్రతిభావంతులైన గాయనీగాయకులు ప్రయత్నించినా అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి మాధ్యమాలు ఎన్నో ముందుకు వస్తున్నాయి. ఇక యాప్ ల ప్రపంచంలో గాయనీగాయకుల కోసం బోలెడన్ని కాంటెస్ట్ లు రన్ అవుతున్నాయి. ఈ వేదికలపై ఆర్జించేవాళ్లకు ఆనందించేవాళ్లకు కొదవేమీ లేదు. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి కార్పొరెట్ దిగ్గజాలు భారీ మొత్తాలను చెల్లించి తెలుగు సినిమాలను కొనుక్కుంటున్నాయి. ఇది ఫిలింమేకర్స్ కి కొంతవరకూ రిటర్నుల పరంగా భరోసాని ఇచ్చింది.
Full View