అంతా అనుకున్నట్లు జరిగితే ‘శతమానం భవతి’ సినిమాలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించాల్సింది. కానీ అప్పటికి వేరే కమిట్మెంట్లు ఉండటంతో అతను ఆ సినిమా చేయలేకపోయాడు. నిజానికి సాయిధరమ్ కొంచెం తెలివిగా వ్యవహరించి ఉంటే.. వేరే కమిట్మెంట్లు పక్కన పెట్టయినా ఈ సినిమా చేసి ఉండేవాడు. కానీ తిక్క.. విన్నర్ లాంటి సినిమాల మీద దృష్టి పెట్టి దీన్ని వదులుకున్నాడు. చివరికి ఆ సినిమాలకు ఎలాంటి ఫలితాలొచ్చాయో.. ‘శతమానం భవతి’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. దిల్ రాజు బేనర్లో ‘శతమానం భవతి’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లు కొట్టిన తేజు.. ‘శతమానం భవతి’ కూడా చేసి ఉంటే అతడి రేంజే వేరుగా ఉండేది. కానీ ఏం చేస్తాడు పాపం. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.
ప్రస్తుతం రైటర్ టర్న్డ్ డైరెక్టర్ బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు సాయిధరమ్. ఆ సినిమా ఏమవుతుందో ఏమో కానీ.. తన కెరీర్ ను మళ్లీ దిల్ రాజు సినిమాతోనే గాడిన పెట్టుకోవాలని తేజు భావిస్తున్నాడు. రాజు కూడా తేజుతో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడు. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న తేజు కోసం ఓ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘శ్రీనివాస కళ్యాణం’ అనేది ఆ సినిమా టైటిలంటున్నారు. దిల్ రాజు తనతో పక్కాగా సినిమా చేస్తాడో లేదో అని డౌట్లు కొట్టాయో ఏమో.. తేజు ఆయన్ని తన ‘జవాన్’ సినిమా సెట్ కు ఆహ్వానించి మరీ.. ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు సన్మానం కూడా చేసి పెట్టాడు. ఈ సందర్భంగానే మళ్లీ రాజు-తేజు కాంబినేషన్ పక్కా అని వెల్లడైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/