తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి తెలుగు నిర్మాతల మండలికి, టాలీవుడ్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని, డబ్బింగ్ సినిమాలకు ఆ తరువాతే థియేటర్లు కేటాయించాలంటూ ఇటీవల నిర్మాత మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరోతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న `వారసుడు` మూవీ కారణంగా తాజా వివాదం తలెత్తింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని తమిళంలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో `వారీసు`గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో `వారసుడు` పేరుతో 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఏరియాల్లో కీలక థియేటర్లని `వారసుడు` సినిమాకు ఫైనల్ చేయడమే కాకుండా ఎగ్జిబిటర్లతో అగ్రిమెంట్ లు కూడా చేయించుకున్నారు.
ఇదే సమయంలో చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి` సినిమాలు బరిలో దిగుతున్నాయి. అయితే వీటికి పలు చోట్ల కీలక థియేటర్లు `వారసుడు` కారణంగా దక్కడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో 2017లో చేసుకున్న ఒప్పందం ప్రకారం పండగల సీజన్ లలో తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించిన తరువాతే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని అనుకున్నారు.
కానీ `వారసుడు` విషయంలో అలా జరగడం లేదని భావించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందు తెలుగు సినిమాలకే థియేటర్లు కేటాయించాలని, ఆ తరువాతే డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించాలంటూ ప్రకటన విడుదల చేసింది. దీనిపై తమిళ నిర్మాతలు మండిపడటం మొదలు పెట్టారు. దర్శకుడు లింగుస్వామి ఏకంగా ఈ వివాదంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిని హెచ్చరించడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీనిపై పలువురు నెటిజన్ లు చురకలు అంటిస్తున్నారు.
తెలుగు డబ్బింగ్ సినిమాలకు తమిళంలో 50 శాతం ట్యాక్స్ ని వసూలు చేస్తున్న తమిళ వర్గాలు మన టైమ్ వచ్చేసరికి ఎదురు తిరుగుతూ వార్నింగ్ లు ఇవ్వడం ఏమీ బాగాలేదని నెటిజన్ లు మండిపడుతున్నారు. ఈ వివాదంపై నెటిజన్ లు రెండు వర్గాలుగా చేరి కొంత మంది తెలుగు నిర్మాతల మండలిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే మరి కొంత మంది తమిళ నిర్మాతలు, లింగు స్వామిపై ఫైర్ అవుతున్నారు. `వారసుడు` నిర్మాత దిల్ రాజు.. మరి లింగుస్వామి ఎవరని, అతను ఎందుకింతలా ఎగిరిపడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. అతను బాహాటంగా వార్నింగ్ లిస్తూ `వారీసు`కి మందు వారీసు తరువాత సినిమాల వుంటుందంటుటే అతనికి ధీటుగా టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వకపోవడం విచారకరం అంటూ మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.