సాయిధరం తేజ్ - రాశి ఖన్నా కాంబినేషన్ లో సుప్రీం చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దిల్ రాజు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ సినిమాకి సంబంధించిన నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నాడన్నది ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. తన సినిమా హక్కులను తనే దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది.
సుప్రీం మూవీకి అన్ని ఏరియాలు - శాటిలైట్ - రీమేక్ సహా.. హోల్ అండ్ సోల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ కి అమ్మేశాడు దిల్ రాజు. డీల్ కూడా ఇప్పటికే ఓకే అయిపోయింది. దిల్ రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్-ఎగ్జిబిటర్ కూడా. సాధారణంగా తన సినిమాలను నైజాం ఏరియాలో తనే రిలీజ్ చేసుకోవడం దిల్ రాజుకు అలవాటు. కానీ సుప్రీం విషయంలో అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఈ నిర్మాత.. నైజాం వరకూ తనే రిలీజ్ చేసుకుంటానంటూ.. అభిషేక్ పిక్చర్స్ వారిని సంప్రదించాడు.
దిల్ రాజు అభ్యర్ధనకు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అంగీకరించి.. నైజాం వరకూ సుప్రీం రైట్స్ ను ఇచ్చేసింది. ఇలా తన సినిమాకి తనే రైట్స్ దక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట. ప్రస్తుతం కొన్ని పాటలు మినహా.. ఈ మూవీ దాదాపుగా షూటింగ్ పూర్తైపోయింది. తేజు ఇందులో ట్యాక్యీ డ్రైవర్ గా నటిస్తుండగా.. హీరోయిన్ రాశి ఖన్నా పోలీస్ పాత్ర చేస్తోంది.