7 రోజుల్లో 100కోట్లు.. కాని..

Update: 2017-06-27 04:28 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జగన్నాధం సినిమా జూన్ 23న విడుదలై మిశ్రమ ఫలితాలను అందుకుంది. కాకపోతే సినిమాకు కేవలం 4 రోజుల్లోనే 75 కోట్లు గ్రాస్ వచ్చిందట. ఈ సందర్భంగా దిల్ రాజు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. భారీ అంచనాలు వలనే ఇటువంటి స్పందన వచ్చింది అని అది సినిమా కలెక్షన్లు పై ఎటువంటి ప్రభావం చూపలేదని ఆ చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక నిర్మాత దిల్ రాజు అయితే ఒక ఆశ్చర్యపరిచే ప్రకటన చేశాడు.

దిల్ రాజు ఎంతటి విజయవంతమైన సినిమా గురించైనా గొప్పలు పెద్దగా చెప్పడనే టాక్ ఉంది. తను చేసిన మంచి సినిమాలకు విజయం అందిస్తే అందరికీ థాంక్స్ చెబుతాడు కానీ రికార్డులు గురించి ఎప్పుడూ మాట్లాడడు. కానీ ఇప్పుడు ఈ దువ్వాడ జగన్నాధం సక్సెస్ మీట్ లో మా సినిమా 4 రోజులలో 75 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది అని ఇంకా ఈ వారంలోనే 100 కోట్లు రికార్డు కూడా చేయబోతుంది అని చెప్పాడు. నిర్మాత - సినిమా పంపిణీదారుడుగా చాలా అనుభవం ఉన్న దిల్ రాజు ఇలా మాట్లాడటం అల్లు అర్జున్ ఫాన్స్ కాస్త ఊరటనివ్వచ్చు కాని.. 100 కోట్లు గ్రాస్ వచ్చినా కూడా సినిమాను పంపిణీ చేసిన వారు పెద్దగా రికవర్ అవ్వరు కదా అనే మాట ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తోంది. ముఖ్యంగా యూ‌ఎస్ మార్కెట్ లో బాలీవుడ్ ట్యూబులైటును సినిమాను సైతం వెనకకు నెట్టిన దువ్వాడ జగన్నాధం.. ఫుల్ రన్ లో సగం లాస్ తెచ్చే ఛాన్సుందనేది ట్రేడ్ వర్గాల జోస్యం.

ఏదేమైనా దువ్వాడ జగన్నాధమ్ పరిస్థితి ఏంటనేది ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. గతంలో సన్నాఫ్‌ సత్యమూర్తి.. సరైనోడు సినిమాలకు ముందు నెగెటివ్ టాక్ వచ్చినా తరువాత తరువాత పాజిటివ్ గా మారింది. కాని దువ్వాడ విషయంలో ఎందుకో అలా జరగట్లేదు. ఈరోజు (మంగళవారం) కలక్షన్ల బ్రేక్ డౌన్ చూస్తే కాని సినిమా బ్రేకీవెన్ ఏంటనేది అర్ధమవ్వదు. వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News