దిల్ రాజు నిర్మాత కావడాని కంటే ముందు డిస్ట్రిబ్యూటర్. ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా ఆడదో అంచనా వేసి పెట్టుబడి పెట్టడంలో ఆరితేరిపోయాడు. ఏ సినిమా స్టామినా ఎంతో.. దాన్ని ఎంత పెట్టి కొనవచ్చో కూడా రాజుకు బాగా తెలుసు. ఆయన అంచనాలు అన్నిసార్లూ ఫలిస్తాయనేమీ లేదు కానీ.. చాలా సందర్భాల్లో అంచనా తప్పదు. టాలీవుడ్‌లో ఏ పెద్ద సినిమా వచ్చినా నైజాం ఏరియాకు ఆయన ముందు రేసులో ఉంటారు. మొన్న సన్నాఫ్ సత్యమూర్తి సినిమా నైజాం రైట్స్‌కు రూ.13 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే అంత అవసరమా అన్నారు జనాలు. కానీ ఆ సినిమా డివైడ్ టాక్‌ను తట్టుకుని రాజు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చిపెట్టింది.
ఐతే ఎంత పెద్ద సినిమా అయినా.. నైజాం ఏరియాలో ఇప్పటిదాకా ఎవ్వరూ రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. అలాంటిది బాహుబలి నైజాం రైట్స్ కోసం ఏకంగా రూ.22.5 కోట్లు పెట్టాడు రాజు. ఇది మరీ రిస్క్ కదా అని అడిగితే.. ''బాహుబలి స్పెషల్ మూవీ. దీనికి హద్దులు లేవు. మగధీర లాగే తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంటే మనం ఆశ్చర్యపోయే కలెక్షన్లు వస్తాయి. అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేవాళ్లు 12-18 శాతం మాత్రమే. వీరిలో ఐదు శాతం పెరిగినా లెక్కలన్నీ మారిపోతాయి. బాహుబలి లాంటి సినిమా వచ్చినపుడు మ్యాజిక్‌లు జరుగుతాయి. మగధీరకు వచ్చినట్లే మార్నింగ్ షోతో హిట్ టాక్ వస్తే బాహుబలి చరిత్ర సృష్టించడం ఖాయం'' అని చెప్పారు రాజు.