ఆదిత్య 999.. బాలయ్య ప్లాన్ అదుర్స్..!
నందమూరి బాలకృష్ణ చేసిన 100 సినిమాల చరిత్రలో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ చేసిన 100 సినిమాల చరిత్రలో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే ప్రధమంగా చెప్పాల్సి వస్తే ఆదిత్య 369 ఉంటుంది. సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాస్ట్, ఫ్యూచర్ ఇలా రెండు కాలాల్లో ప్రయాణిస్తూ అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించింది. బాలయ్య కూడా తన ఫేవరెట్ మూవీస్ లో ఆదిత్య 369 సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు. ఐతే కొన్నాళ్లుగా ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 వస్తుందని వార్తలు వచ్చాయి.
బాలకృష్ణ స్వయంగా కథ రాసి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఆదిత్య 999 కథ మొదలు పెట్టింది నిజమే కాదు వరుస సినిమాల వల్ల బాలయ్య బాబు ఆ కథను పూర్తి చేయలేదని టాక్. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి భారీ అనౌన్స్ మెంట్ తో ఆ సినిమా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఐతే ఆదిత్య 999 సినిమాలో బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాను ఒక మల్టీస్టారర్ గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. ఇప్పటికే ఆదిత్య 999 లో మోక్షజ్ఞ ఉంటాడని గట్టిగా చెబుతున్నారు. ఇంకా యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో భాగం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య అంటే ఈ ఇద్దరి హీరోలకు విపరీతమైన ప్రేమ అభిమానం. ఏ ఈవెంట్ జరిగినా సరే బాలకృష్ణ పక్కన వీరు దర్శనమిస్తారు.
సో ఆదిత్య 999 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో విశ్వక్ సేన్, సిద్ధు కూడా ఉంటే మాత్రం కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. న్యూ ఏజ్ యాక్టర్స్ గా తమ సినిమాలతో యూత్ ఆడియన్స్ ని మెప్పిస్తున్న సిద్ధు, విశ్వక్ సేన్ లు బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే అదిరిపోతుంది. ఐతే ఆదిత్య 999 సినిమాను బాలయ్య భారీ స్కేల్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ అంచనాలు పెంచుతుండగా అఫీషియల్ న్యూస్ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య డైరెక్షన్ లో రాబోతున్న ఆదిత్య 999 చాలా మిరకిల్స్ ఉంటాయని మాత్రం అర్థమవుతుంది.