సినీనిర్మాణం అంటే ఆషామాషీ కాదు. కథ ఎంపిక మొదలు బౌండ్ స్క్రిప్టు రెడీ అయ్యేవరకూ.. ప్రీప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ సహా ఈ మధ్య కాలంలో షూటింగ్ ప్రిపరేషన్ కి అవసరమయ్యే ప్రతి పైసాని సర్ధాలి. ఫైనాన్సులు తేవాలి. ఖాతాల్లో ఉన్నవి పెట్టాలి. ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంటుంది. అన్నిపనులు అయ్యాక సెన్సార్ క్లియరెన్స్ ని సాఫీగా సాగేలా చూడడం రిలీజ్ ప్రహసనం వగైరా వగైరా చాలా ఉంటాయి. అయితే అన్నిటా అలాంటి సమర్థత నేటి జనరేషన్ నిర్మాతల్లో దిల్ రాజుకు పుష్కలంగా ఉంది కాబట్టే తన జర్నీని సజావుగా సాగిస్తున్నారు. పంపిణీదారుగా ఎగ్జిబిటర్ గా అగ్ర నిర్మాతగా అతడి హవా కొనసాగుతోంది. భారీ ఒప్పందాలతో స్టార్లను లాక్ చేయడంలో అతడు తనకు తానే సాటి. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా నిర్మాతగా అనుభవాన్ని ఘడించి సొంత బ్యానర్ తో ముందుకెళుతున్నాడు.
ఇప్పుడు దిల్ రాజు వారసురాలు కూడా నిర్మాతగా ఆరంగేట్రం చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. తండ్రి అడుగుజాడలను అనుసరించి దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి సినీ నిర్మాణంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. తొలిగా డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల కోసం కంటెంట్ ని అందించాలన్నది ప్లాన్. తన తండ్రి నిరంతరం అగ్ర హీరోలతో పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ స్థాయి సినిమాలపై దృష్టి సారిస్తారు కాబట్టి ఇకపై చిన్న సినిమాలు వెబ్ సిరీస్ ల బాధ్యత తాను టేకోవర్ చేస్తారట. తొలిగా డిజిటల్లో అనుభవం ఘడించి ఆ తర్వాత నెమ్మదిగా సినీనిర్మాతగా స్కోప్ ని పెంచుకుంటారు.
హన్షిత కూడా గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 లాగా ప్లాన్ చేస్తున్నారా? లేదూ..హన్షితా రెడ్డి తన సొంత బ్యానర్ ను తెరపైకి తెస్తారా లేక తన తండ్రిగారికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ శాఖను ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక హన్షిత సహా ఫ్యామిలీ సినిమాలకు దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ రెడ్డి సహాయసహకారాలు ఎల్లపుడూ ఉంటాయి. హన్షితా రెడ్డి 2014 లో ఆర్కిట్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. తన తల్లి గారు మరణానంతరం తండ్రి దిల్ రాజుకు రెండో వివాహాన్ని ఆమె జరిపించారు. ఇక హన్షిత కూడా వారసత్వ లెగసీని కొనసాగిస్తూ నిర్మాతగా పెద్ద స్థాయికి ఎదిగేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారసులు లెగసీని నడిపిస్తున్నారు!
టాలీవుడ్ లో మహిళలు నిర్మాతలు అవ్వడం ఇప్పుడే కొత్త కాదు. ప్రముఖ నిర్మాతల కుమార్తెలు సమర్పకులుగా పాపులరవుతున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు 3 ఏంజెల్స్ అనే బ్యానర్ ని స్థాపించి నిర్మాతలుగా అనుభవాల్ని ఘడించారు. నార్జున మేనకోడలు సుప్రియ అన్నపూర్ణ బ్యానర్ వ్యవహారాల్ని చూస్తూనే తన సొంత బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేసే యోచనలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొనిదేల తన సొంత ప్రొడక్షన్ హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రారంభించి సినిమాలు వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేశారు. ప్రముఖ దర్శకనిర్మాత కోడి రామకృష్ణ కుమార్తె కూడా కొద్ది రోజుల క్రితం ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. ఎం.ఎల్ కుమార్ చౌదరి కుమార్తె కీర్తి కూడా నిర్మాతగా పరిశ్రమలో కొనసాగుతున్నారు.