మహేష్ ప్రాజెక్ట్ లోకి దిల్ రాజు ఎంట్రీ

Update: 2016-12-01 07:36 GMT
ప్రస్తుతం మురుగదాస్ తో మూవీ చేస్తున్న మహేష్ బాబు.. ఇది పూర్తి కాగానే కొరటాలతో సినిమా పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. కొరటాల చేస్తున్న టైంలోనే.. మరో మూవీకి కూడా డేట్స్ అడ్జస్ట్ చేశాడని.. పీవీపీ బ్యానర్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతుందని గతంలోనే చెప్పేసుకున్నాం. అయితే.. ప్రాజెక్టులోకి పీవీపీ ప్లేస్ లో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పీవీపీ సినిమా బ్యానర్ తో సూపర్ స్టార్ కు రెండు సినిమాల అగ్రిమెంట్ ఉంది. మొదటి మూవీ బ్రహ్మోత్సవం.. మహేష్ కి అభిమానులకు నిరుత్సాహం మిగిల్చింది. రెండో సినిమాను వంశీ పైడిపల్లితో చేసేందుకు పీవీపీ రెడీ అయినా.. ఈ ప్రాజెక్టును దిల్ రాజు చేతిలో పెట్టాడట మహేష్. ఊపిరి లాంటి హార్ట్ టచింగ్ మూవీ తీసిన వంశీతో సినిమా చేసేందుకు సూపర్ స్టార్ కు అభ్యంతరాలు లేకపోయినా.. వచ్చిన సమస్యల్లా పీవీపీ తోనే అని తెలుస్తోంది.

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతోనే ఇలాంటి అడ్జస్ట్ మెంట్ చేయాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది కానీ.. అందులో వాస్తవం లేదట. పీవీపీతో చేస్తే డిజాస్టర్ కాంబో అనే మాట ముందునుంచి వినిపిస్తుందని.. అందుకే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు మారాయని.. త్వరలో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News