యష్ పై దిల్ రాజు ఫోకస్?

Update: 2023-01-04 03:59 GMT
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా వారి బ్యానర్ లో పాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకురావాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ముందుగా ఆయన వివిధ భాషల్లో లోకల్ నిర్మాతలతో కాస్త ఎక్కువగా టచ్ లో ఉంటూ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ఇతర ఇండస్ట్రీలోని అగ్ర హీరోలనే ఆయన టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదివరకే బాలీవుడ్ లో చిన్న హీరోలతో కొన్ని సినిమాలు చేశారు. కానీ అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు దిల్ రాజు తమిళంలో విజయ్ తో వారసుడు అనే సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడ దిల్ రాజుకు బాగానే ఫోకస్ అయ్యాడు.

అయితే దిల్ రాజు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ సూపర్ స్టార్ యష్ ను కూడా టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతనితో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  అతనికి దిల్ రాజు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. తప్పకుండా తెలుగులో అతనికి సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దిల్ రాజు మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే ఆయన డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.

ముందుగా అయితే దిల్ రాజు ఒక స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అతను లైన్ లో ప్రస్తుతానికి ఒకే ఒక ప్రాజెక్టు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కథలు వింటున్నాడు కానీ ఏది ఫైనల్ చేయలేదు.

ఇక దిల్ రాజు ఈ స్పేస్ ని వాడుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే ముందుగా అడ్వాన్స్ ఇచ్చి యష్ తో ఓ కథ గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ అది సెట్ కాకపోయినా కూడా మరో రెండు మూడు కథలు అయినా సరే సెట్ చేయించి సినిమాలు చేయాలి అని దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. మరి దిల్ రాజు యష్ కోసం ఎలాంటి దర్శకుడుని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News