సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ నిర్మాణం విషయంలో చోటు చేసుకున్న మలుపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పీవీపీ సినిమాస్ బేనర్లో మొదలైన ఈ చిత్రం ఆ తర్వాత దిల్ రాజు చేతికి వచ్చింది. మధ్యలో అశ్వినీదత్ కలిశాడు. చివరికి అనివార్య పరిస్థితుల్లో తిరిగి పీవీపీ యాడ్ అయ్యాడు. ఐతే ప్రొడక్షన్ టైంలో మొత్తం దిల్ రాజే ముందుండి నడిపించాడు. మిగతా ఇద్దరూ స్లీపింగ్ పార్ట్ నర్స్ లాగా ఉండిపోయారు. ఎక్కడా మేకింగ్ లో వీళ్ల పాత్ర ఉన్నట్లు కనిపించలేదు. సినిమాలో వీళ్లిద్దరి వాటా కూడా తక్కువే అన్నది సమాచారం. ఈ సినిమా ప్రమోషన్ల టైంలో ఎప్పుడూ దిల్ రాజే ముందు కనిపించాడు.
సినిమా ప్రోమోల్లో దిల్ రాజు పేరే ముందు పడేది. తర్వాత అశ్వినీదత్ - పీవీల పేర్లు వచ్చేవి. ఐతే ఈ రోజు ‘మహర్షి’ రిలీజైన థియేటర్లలో మాత్రం భిన్నమైన దృశ్యం కనిపించింది. వరుస క్రమంలో బేనర్లు వేసేటపుడు ‘వైజయంతీ మూవీస్’కే అగ్ర తాంబూలం దక్కింది. తర్వాత ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’.. చివరగా ‘పీవీపీ సినిమాస్’ బేనర్లు వేశారు. చివర్లో నిర్మాతల పేర్లు వేసేటపుడు కూడా అశ్వినీదత్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజు - పీవీపీల పేర్లు పడ్డాయి. మరి వాటాల పంపకం దగ్గర గొడవ జరిగిన నేపథ్యంలో దత్ ఈ మేరకు కండిషన్ పెట్టి తన పేరు ముందు వేయించుకున్నాడా లేక మే 9న ఆయన బేనర్ నుంచి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ - ‘మహానటి’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ వచ్చిన నేపథ్యంలో సెంటిమెంటుగా ఆయన పేరు ముందు వేశారా అన్నది తెలియాల్సి ఉంది.