ఇప్పటికే చాలాసార్లు ‘దటీజ్ దిల్ రాజు’ అనిపించాడు రాజు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు మహిమ ఏంటో తెలుస్తోంది. అతడి హ్యాండ్ పడితే.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సినిమాను కూడా పైకి తేగలడని మరోసారి రుజువైంది. భారీ నష్టాలు మూటగట్టుకుంటుందని అనుకున్న ‘రుద్రమదేవి’ ఈ రోజు గుణశేఖర్ స్వల్ప నష్టాలతో బయటపడేలా చేస్తోందంటే అందులో దిల్ రాజు పాత్ర చాలా కీలకం. దిల్ రాజు ప్లానింగ్, అతడి చొరవ వల్ల.. ‘రుద్రమదేవి’ ఈ రోజు నైజాం రారాణిగా అవతరించింది. ఇక్కడ ఆ సినిమా రూ.15 కోట్ల దాకా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో వారంలోనూ ఒక కొత్త సినిమా స్థాయిలో భారీ సంఖ్యలో థియేటర్లలో ‘రుద్రమదేవి’ ఆడుతోంది, కలెక్షన్లు సాధిస్తోంది అంటే అందుకు రాజు ప్రధాన కారణం.
నైజాం ఏరియాలో దిల్ రాజు ఆధ్వర్యంలో చాలా థియేటర్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. అతను నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆటోమేటిగ్గా నైజాంలో చాలా రోజులు ఆడతాయి. కేరింత - సినిమా చూపిస్త మావ - సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిన్న-మోసర్తు సినిమాలకు కూడా మూడో వారంలో మంచి థియేటర్లు లభించాయంటే అందుకు దిల్ రాజే కారణం. ‘రుద్రమదేవి’ భారీ సినిమా కావడంతో దీనికి మరింత భారీగానే థియేటర్లు లభించాయి. 2 - 3 వారాల్లో సైతం ఓ రిలీజ్ సినిమా రేంజిలో ఆడుతోందీ సినిమా.
తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కావడం, తెలంగాణ యాసతో పెట్టిన గోన గన్నారెడ్డి పాత్ర హైలైట్ కావడంతో థియేటర్లు కూడా బాగానే నిండుతున్నాయి. దీంతో ఇప్పటికే రూ.15 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది ‘రుద్రమదేవి’. ఐతే ఈ సినిమాకు తెలంగాణలో పన్ను మినహాయింపు రావడంలో కూడా రాజు ముఖ్య పాత్ర పోషించాడు. దీని వల్ల 15 శాతం ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ కూడా మిగిలింది. థియేటర్ల రెంట్లు - పబ్లిసిటీ భారం మాత్రమే గుణశేఖర్ పై పడింది. దీని వల్ల నెట్ వసూళ్లే షేర్ అయ్యాయి. రూ.12 కోట్లకు రాజు హక్కులు కొంటే ఈపాటికే దాన్ని మించిన వసూళ్లు వచ్చేశాయి. ఫుల్ రన్ లో సినిమా నైజాం వరకు రూ.15 కోట్ల దాకా ఫేర్ తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాంలో బాగా ఆడుతుండటటంతో ఆ ప్రభావం కొంత వరకు సీడెడ్ - ఆంధ్రా ఏరియాల మీద కూడా పడుతోంది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ థియేటర్లలోనే ఆడుతోందా సినిమా. దీంతో ఇంకొంత కాలం బాక్సాఫీస్ దగ్గర ‘రుద్రమదేవి’ హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.