బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలో నేరుగా కాకపోయినా.. డిస్ట్రిబ్యూటర్‌గా అయినా భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పాడు దిల్ రాజు. నైజాంలో బాహుబలి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. ఈ సినిమా మీద రూ.23 కోట్ల దాకా పెట్టుబడి పెట్టాడు రాజు. ఐతే అంత పెట్టి రైట్స్ కొంటుంటే మరీ రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే రాజు పంట పండినట్లే అనిపిస్తోంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో ఒక్క నైజాంలోనే రూ.30 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బాహుబలి విడుదలకు ముందు రోజు నుంచి తీరిక లేకుండా గడుపుతున్న రాజు మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది. సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే మతి పోతోంది. గత 24 గంటల నుంచి నేను థియేటర్లకు తిరుగుతూనే ఉన్నా. ఆడియన్స్ మామూలుగా రెస్పాండవ్వట్లేదు. ఓ అద్భుతం చూశామంటున్నారు. కొందరు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లకు ప్రసాద్ ఐమాక్స్‌లో స్పెషల్ షో వేశాం. వాళ్లు కూడా సినిమా అద్భుతం అన్నారు. ఐమాక్స్‌లో సాయంత్రం వస్తుంటే ఓ 12 ఏళ్ల కుర్రాడు ఎదురుపడ్డాడు. అతను ఉదయమే సినిమా చూశాడంట. మళ్లీ సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తున్నాడు. అదీ ప్రేక్షకుల పరిస్థితి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరనట్లు ఉంది సినిమా'' అని చెప్పాడు రాజు.