‘జవాన్’ సినిమాకు దిల్ రాజు నిర్మాత కాదు. సమర్పకుడు మాత్రమే. చిత్ర బృందంలో ఉన్న వాళ్లందరూ తనకు సన్నిహితులు కావడంతో.. వాళ్లొచ్చి బలవంతం చేయడంతో ఈ సినిమాను తన బేనర్ మీదుగా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినట్లు రాజు చెప్పాడు. ఐతే ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాక రాజు ఎంత శ్రద్ధ పెడతాడో తెలిసిందే. ‘జవాన్’ విషయంలో ఆయన చాలా కేర్ తీసుకున్నాడు. ఆగస్టుకే ఫస్ట్ కాపీతో రెడీ అయినప్పటికీ.. సంతృప్తి చెందక మళ్లీ స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేయించాడు. రీషూట్లు చేయించాడు. అంతా పర్ఫెక్ట్ అనుకున్నాక డిసెంబరు 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయించాడు. రిలీజ్ ముంగిట గట్టిగా ప్రమోషన్లు చేయించాడు. ప్రిమియర్ షో కూడా వేయించాడు. మొత్తంగా రిలీజ్ ముంగిట రాజు తన వంతుగా ఈ సినిమాకు ఎంత చేయాలో అంతా చేశాడు.
కానీ రిలీజ్ తర్వాత మాత్రం ‘జవాన్’ను రాజు వదిలేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమా వీకెండ్ తర్వాత దబేల్ మని కింద పడింది. వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. సోమవారం నుంచి చాలా నామమాత్రపు వసూళ్లతో నడిచింది. ఐతే వసూళ్లు పెంచడానికి.. జనాల్ని థియేటర్లకు రప్పించడానికి ‘జవాన్’ టీం పెద్దగా ప్రయత్నమేమీ చేయలేదు. మామూలుగా దిల్ రాజు తన సినిమాల్ని రిలీజ్ తర్వాత కూడా బాగా ప్రమోట్ చేయిస్తాడు. ఒక పట్టాన ఆశలు వదులుకోడు. థియేటర్ల నుంచి సినిమాను తీయనివ్వడు. కానీ ‘జవాన్’ సినిమా విషయంలో మాత్రం ఆయన కూడా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. వారం గడిచేసరికి ‘జవాన్’ థియేటర్లు చాలా ఎగిరిపోయాయి. రెండు వారాలకు సినిమా అడ్రస్ లేకుండా పోయింది. బయ్యర్ల పెట్టుబడిలో సగం మాత్రమే రికవర్ అయింది. టాక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా చూస్తే మాత్రం ఇది డిజాస్టరే.