దిల్ రాజు సినిమా అంటే ప్రతి అడుగులోనూ ఆయన ప్రమేయం ఉంటుందంటారు. స్క్రిప్టు ఆయన ఓకే చేశాకే సినిమా ముందుకు కదులుతుంది. ఎప్పటికప్పుడు ఔట్ పుట్ చూస్తూ.. మార్పు చేర్పులు కూడా సూచిస్తుంటారని.. ఎడిటింగ్ సమయంలోనూ ఆయన హ్యాండ్ పడక తప్పదని చెబుతుంటారు. ఆయనకు ఏం నచ్చకపోయినా సినిమా బయటికి రాదని అంటారు. ఎంత పెద్ద దర్శకుడైనా సరే.. మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్పి.. అవసరమైతే మార్పులు చేర్పులు చేయిస్తారని కూడా చెబుతుంటారు. ఐతే ‘ఫిదా’ విషయంలో మాత్రం తాను ఎంతమాత్రం జోక్యం చేసుకోలేదని రాజు చెప్పడం విశేషం. ఇది నూటికి నూరు శాతం శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు రాజు.
విశేషం ఏంటంటే.. ‘ఫిదా’ క్లైమాక్స్ అసలు రాజుకు అర్థమే కాలేదట. బాన్సువాడలో ‘ఫిదా’ షెడ్యూల్ నడుస్తుండగా.. షూటింగ్ చూద్దామని వెళ్లాడట రాజు. అప్పుడు కమ్ముల క్లైమాక్స్ తీస్తున్నాడని.. తాను వెళ్లి సీన్ పేపర్ చూస్తే అసలు క్లైమాక్స్ ఏంటో తనకు అర్థం కాలేదని రాజు తెలిపాడు. ఐతే ఆ విషయం కమ్ములకు చెబితే డిస్టర్బ్ అవుతాడేమో.. ప్రెజర్ ఫీలవుతాడేమో.. తను నమ్మింది తను తీయనీ అని భావించి అక్కడి నుంచి వచ్చేశానని రాజు తెలిపాడు. దీన్ని బట్టి రాజు కమ్ములను ఎంతగా నమ్మాడో.. అతడికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో కూడా అర్థం చేసుకోవచ్చు. నిర్మాతగా తన కెరీర్లో తన ప్రమేయం అతి తక్కువగా ఉన్న సినిమా కూడా ఇదే అన్నాడు రాజు. అమెరికా షెడ్యూల్ జరుగుతుండగా అక్కడికి వెళ్తే.. తన భార్య చనిపోయినట్లు తెలియడంతో వెనక్కి వచ్చేశానని.. అలా మొత్తం షూటింగ్ లో దాదాపుగా తాను లేనని.. చివరగా ఔట్ పుట్ చూస్తే మాత్రం అద్భుతంగా అనిపించిందని రాజు తెలిపాడు.