దిల్ రాజు కూడా కాపాడలేకపోయాడే..

Update: 2017-12-08 17:21 GMT
‘జవాన్’ సినిమా గురించి విడుదలకు ముందు దిల్ రాజు చెప్పిన మాటలు చూసి ఇది పక్కాగా హిట్టవుతుందనే అనుకున్నారంతా. రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ చూసి.. హిట్ కాకపోయినా ఎబోవ్ యావరేజ్ అవుతుందని భావించారు. కానీ ఈ అంచనాలేవీ ఫలించేలా లేవు. ఈ సినిమా కనీసం యావరేజ్ స్థాయిని కూడా అందుకోవడం కూడా కష్టంగా ఉంది. చివరికిది డిజాస్టర్ అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ రూ.9 కోట్లు మాత్రమే కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తొలి రోజు రూ.3.6 కోట్లు.. తొలి వీకెండ్లో రూ.7.85 కోట్లు షేర్ కలెక్ట్ చేసి ఓకే అనిపించిన ‘జవాన్’ వీకెండ్ తర్వాత తేలిపోయింది. వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సోమవారం నుంచి చాలా నామమాత్రంగా కలెక్షన్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో షేర్ రూ.కోటి మాత్రమే ఉండటం ఈ సినిమా దయనీయ పరిస్థితిని తెలియజేస్తుంది. కంటెంట్ పరంగా పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇలా పడిపోవడం ఆశ్చర్యమే.

ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయినట్లుంది. పోటీగా వచ్చిన ‘ఆక్సిజన్’.. ‘ఇంద్రసేన’ సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘జవాన్’ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దిల్ రాజు ఈ సినిమాకు మొదట్నుంచి బ్యాకప్ ఇస్తూ.. సినిమా పూర్తయ్యాక కూడా మార్పులు చేర్పులు చేయించి.. అంతా పర్ఫెక్ట్ అన్నాక రిలీజ్ చేయించాడు. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఆయన ఎంతో ధీమాగా కనిపించారు. ఇంత చేసి కూడా సాయిధరమ్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాడు దిల్ రాజు.


Tags:    

Similar News