దిల్‌ రాజు రెండు హర్డిల్స్‌ దాటేస్తాడా?

Update: 2015-04-11 15:30 GMT
ఒకప్పటిలా ఈ మధ్య దిల్‌ రాజు పట్టిందల్లా బంగారమేమీ కావట్లేదు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు రిస్కులు చేస్తూనే ఉంటాడు దిల్‌ రాజు. అందుకే అతడి డేర్‌నెస్‌ని మెచ్చుకోవాల్సిందే. వచ్చేవారం తన నిర్మాణంలో ఓ సినిమా రాబోతోందని తెలిసినా.. ఈ వారం వేరే వాళ్ల సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టాలంటే గట్స్‌ ఉండాలి. దిల్‌ రాజు ఆ గట్స్‌ చూపించాడు. 17వ తారీఖున విడుదలయ్యే మణిరత్నం సినిమా ఓకే బంగారంను విడుదల చేస్తోంది రాజే. సినిమాను చాన్నాళ్ల కిందటే హోల్‌ సేల్‌గా కొనేశాడు రాజు. తెలుగు వెర్షన్‌ విషయంలో మణిరత్నం ఏం జోక్యం చేసుకోలేదు. రాజే అన్నీ తానై నడిపించాడు. నిర్మాతగా దిల్‌ రాజు ట్రాక్‌ రికార్డు ఏమంత గొప్పగా లేదు కాబట్టి.. ఈ సినిమా అతడికి చాలా కీలకం.

ఐతే ఈ వారం విడుదలైన సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాను నైజాం ఏరియాలో రిలీజ్‌ చేసింది రాజే. దీని మీద రాజు దాదాపు 14 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అదంతా వసూలై లాభాలు రావాలంటే సినిమా పెద్ద హిట్టవ్వాలి. రెండు, మూడు వారాల్లోనూ కలెక్షన్లు కొల్లగొట్టాలి. సన్నాఫ్‌ సత్యమూర్తికి వస్తున్న టాక్‌ ప్రకారం చూస్తే కష్టమే అన్నట్లుంది. ఐతే సన్నాఫ్‌ సత్యమూర్తి మరీ ఇరగాడేసినా దిల్‌ రాజుకు కష్టమయ్యేది. ఓకే బంగారం మీద ఆ ఎఫెక్ట్‌ ఉండేది. ఆ సినిమా మీద రాజు తక్కువ పెట్టుబడి పెట్టాడు కాబట్టి.. బాగా ఆడితే ఎక్కువ లాభాలు తెచ్చుకునే అవకాశముంది. ఆ యాంగిల్లో చూస్తే సన్నాఫ్‌ సత్యమూర్తి కంటే కూడా ఓకే బంగారం సినిమానే బాగా ఆడాలని కోరుకుంటాడు రాజు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సత్యమూర్తి.. మీద పెట్టిన పెట్టుబడిని అతి కష్టం మీద రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే బంగారం సినిమాకు మంచి టాక్‌ వస్తే మాత్రం లాభాల పంట ఖాయం.



Tags:    

Similar News