నాలుగు కోట్ల లాభంలో దిల్ రాజు

Update: 2016-06-16 10:57 GMT
నిర్మాతగా దిల్ రాజు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది కానీ.. డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఆయనకు భలేగా కలిసొస్తోంది. గత ఏడాది బాహుబలి.. పటాస్.. సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో భారీగానే వెనకేశాడు రాజు. ఈ ఏడాది ‘ఎక్స్ ప్రెస్’ రాజాతో శుభారంభం చేసిన రాజు.. లేటెస్టుగా ‘అఆ’ సినిమాతో బాగానే ఖజానా నింపుకున్నాడు.

ఫస్ట్ కాపీ చూసి సినిమా సత్తా ఏంటో పసిగట్టేసిన రాజు.. బేరాల్లేకుండా ఫ్యాన్సీ రేటు ఇచ్చి సినిమాను సొంతం చేసుకున్నాడు. రూ.8.3 కోట్లకు ‘అఆ’ నైజాం రైట్స్ తీసుకుంటే రెండు వారాల్లోనే ఈ సినిమా రూ.12.35కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. మూడో వారాంతం కూడా చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చే అవకాశముండటంతో ‘అఆ’ నైజాం షేర్ ఫుల్ రన్లో రూ.15 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ‘అఆ’.. సెకండ్ వీకెండ్లో కూడా ప్రభంజనం కొనసాగించి.. ప్రపంచవ్యాప్తంగా ఇంకో రూ.6 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ వారాంతం నాని సినిమా ‘జెంటిల్మన్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతుండటంతో ‘అఆ’ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశముంది. అయినప్పటికీ ఇప్పటికే రూ.43-44 కోట్ల మధ్య వసూళ్లతో ఉన్న ‘అఆ’ రూ.50 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News