టాలీవుడ్ లో రూపొందే ఏ క్రేజీ సినిమాకైనా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ అండదండలు తప్పకుండా ఉంటాయి. మినిమమ్ వర్క్ అవుట్ అవుతుందన్న ఏ మూవీనీ ఆయన వదిలిపెట్టరు. అలా అని అన్ని సక్సెస్ అయ్యాయని కాదు కానీ దెబ్బ తిన్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఇటీవలి కాలంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. పూరి జగన్నాధ్ రామ్ ల కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న రిలీజ్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శాటిలైట్ డిజిటల్ హక్కులు అమ్మేశారు కానీ థియేట్రికల్ బిజినెస్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నిర్మాతలు చార్మీ పూరిలు ఆశించినంత భారీ మొత్తం పెట్టేందుకు బయ్యర్లు కాస్త ముందు వెనుకా చేస్తున్నారన్న టాక్ ఉంది. ఇలా అయితే ఆలస్యం అవుతుందని గుర్తించిన పూరి టీమ్ వెంటనే దిల్ రాజును సంప్రదించినట్టు తెలిసింది. ఇప్పటికే ఇటు నిర్మాణంలోనూ అటు డిస్ట్రిబ్యూషన్ లోనూ చాలా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యానని ఇస్మార్ట్ శంకర్ ను తీసుకోలేనని సున్నితంగా నో చెప్పినట్టు తెలిసింది.
గత ఏడాది మెహబూబాను దిల్ రాజు చాలా గొప్పగా పొగిడి మరీ ప్రమోట్ చేశారు. ఫలితం తెలిసిందే. దాని ఎఫెక్టో లేక ఆయన అన్నట్టు నిజంగానే తీసుకోలేనంత బిజీగా ఉన్నారో తెలియదు కానీ ఇస్మార్ట్ శంకర్ ని స్వంతంగా రిలీజ్ చేస్తారా లేక మరో థర్డ్ పార్టీని పూరి సెట్ చేసుకుంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడం ఆడియో యావరేజ్ అనిపించుకోవడం కొంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఇస్మార్ట్ శంకర్ ఎలా డీల్స్ సెట్ చేసుకుంటాడో వేచి చూడాలి