షాకింగ్: ‘జోష్’ చరణ్ వద్దంటే చైతూ చేశాడు

Update: 2015-08-24 04:23 GMT
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. నిర్మాత అవతారమెత్తిన కొత్తలో వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఘనుడు దిల్ రాజు. ఐతే నాగచైతన్య హీరోగా పరిచయమైన  ‘జోష్’ సినిమా రాజు బ్యానర్లో తొలి ఫ్లాప్ గా నిలిచింది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ దిల్ రాజు మీద నమ్మకంతో చైతూని ఆయన బేనర్ లో అరంగేట్రం చేయించే బాధ్యత అప్పగించాడు నాగ్. ఐతే జోష్ సినిమా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. ఐతే తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ‘జోష్’ సినిమా గురించి ఒక షాకింగ్ సంగతి బయటపెట్టాడు దిల్ రాజు. అదేంటంటే.. ఈ కథను ముందు విన్నది నాగార్జున, నాగచైతన్యలు కాదు.. చిరంజీవి, చరణ్.

ఈ విషయాన్ని ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో వెల్లడించాడు రాజు. మా బేనర్ లో తీసిన 18 సినిమాల్లో 15 సక్సెస్ అయ్యాయి. ఐతే నిర్మాతగా వరుసగా ఆరు హిట్లు కొట్టాక జోష్ కథ నా దగ్గరికి వచ్చింది. కథ చాలా బాగుందన్న కాన్ఫిడెన్స్ తో ‘మగధీర’ తర్వాత చరణ్ దగ్గరికెళ్లాం. చిరంజీవి గారికి, చరణ్ కు కథ వినిపించాం. బాగుందన్నారు. కానీ వారం తర్వాత ఫోన్ చేసి.. మగధీర తర్వాత ఈ సబ్జెక్టు చరణ్ కు సెట్టవదని చెప్పారు. బాగా డిస్టర్బ్ అయిపోయాను. నాకు కసి పెరిగింది. అప్పటికే వరుస హిట్లు కొట్టడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. తర్వాత నాగార్జున గారికి కథ నచ్చడంతో చైతూతో సినిమా చేశాం. కానీ సినిమా మేం ఊహించని విధంగా ఫ్లాపైంది. రిజల్ట్ చూశాక అర్థమైంది.. మెగాస్టార్ గారి జడ్జిమెంట్ అంటే ఏంటో. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారో కూడా తెలిసొచ్చింది. అప్పట్నుంచి నా సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నా’’ అని దిల్ రాజు చెప్పాడు.
Tags:    

Similar News