‘అఆ’ సినిమాను అల్లు అర్జున్ సమర్పించి.. దిల్ రాజు నిర్మించి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజానికి ఇంతకుముందు ఆ ప్రపోజల్ తెరమీదికి వచ్చిందట. వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పాడు దిల్ రాజు. ‘‘సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతుండగా ఒకసారి సెట్ కు వెళ్లాను. అప్పుడే త్రివిక్రమ్ గారు ‘అఆ’కు సంబంధించి కొన్ని సన్నివేశాలు చెప్పారు. సమంత నితిన్ ఇంటికి రావడం.. టీవీ కొనడం.. ఈ సన్నివేశం గురించి చెప్పగానే నేను.. బన్నీ వెంటనే కనెక్టయిపోయాం. బన్నీ సమర్పణలో నేనే ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నాను. కానీ కుదర్లేదు. రాధాకృష్ణ గారు ఈ సినిమాను నిర్మించారు. నైజాం రైట్స్ నాకు ఇచ్చారు’’ అని రాజు వెల్లడించాడు.
ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు మ్యాజిక్ చేస్తుంటాయని.. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తనకు ‘ఆది’ చాలా లాభాలు తెచ్చిపెట్టిందని.. ఆ తర్వాత పోకిరి.. గబ్బర్ సింగ్.. బాహుబలి లాంటి సినిమాలు అలాగే మ్యాజిక్ చేశాయని.. ఈ ఏడాది ‘అఆ’ అలాగే కలెక్షన్లు సాధిస్తోందని దిల్ రాజు తెలిపాడు. ‘అఆ’ అమెరికాలో రెండో వీకెండ్లోనే 2.5 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడుతోందని రాజు వెల్లడించాడు. సినీ పరిశ్రమలో ప్రతి రెండేళ్లకు టార్గెట్ మారుతూ ఉంటుందని.. ఇన్నాళ్లూ 50 కోట్ల క్లబ్ అనేది టార్గెట్ గా ఉండేదని.. ఇప్పుడది 100 కోట్లకు మారిందని.. తమ హీరో నితిన్ ను రూ.50 కోట్ల కబ్బులో చేర్చిన ఘనత త్రివిక్రమ్ దే అని.. త్వరలోనే అతను 100 కోట్ల మార్కును కూడా అందుకుంటాడని రాజు అన్నాడు.