కుమారి 21ఎఫ్.. గోల్డెన్ హ్యాండ్ పడింది

Update: 2015-11-06 07:42 GMT
ఆ మధ్యలో దిల్ రాజు హ్యాండ్ కొంచెం డల్ అయింది కానీ.. ఇప్పుడు మళ్లీ రైజింగ్ లోనే ఉంది. నిర్మాతగా - డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు చూస్తున్నాడు ఈ గోల్డెన్ ప్రొడ్యూసర్. జడ్జిమెంట్ విషయంలో తిరుగులేదన్న పేరున్న దిల్ రాజు.. ఈ మధ్య కుర్ర హీరో రాజ్ తరుణ్ నటించిన ‘సినిమా చూపిస్త మావ’ చూసి ఫ్లాటై పోయి.. ఆ సినిమాను హోల్ సేల్ గా కొనేయడం.. దాన్ని సొంతంగా రిలీజ్ చేసి, మంచి లాభాలు  అందుకోవడం తెలిసిందే.

ఇప్పుడు దిల్ రాజు గోల్డెన్ హ్యాండ్ మరో సినిమాపై పడింది. అది కూడా రాజ్ తరుణ్ సినిమానే కావడం విశేషం. సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వయంగా నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను రాజు నైజాంలో రిలీజ్ చేయబోతున్నాడట. సుక్కుకు మంచి ప్రైస్ ఇచ్చి కుమారి.. నైజాం రైట్స్ తీసుకున్నాడట రాజు. మొన్న ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో ఫంక్షన్ కు వచ్చినపుడే రాజు ఈ సినిమా మీద కన్నేశాడని జనాలకు అర్థమైంది.

సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ‘కుమారి 21 ఎఫ్’ మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా టీజర్ - ట్రైలర్ - ఆడియో.. అన్నీ సుకుమార్ ముద్రను చూపించాయి. దీంతో అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ ఆఫర్లే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
Tags:    

Similar News