టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు ఇప్పుడు రీమేక్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ కంటే రీమేక్స్ అయితే కొన్ని సార్లు సేఫ్ అనిభావిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు బడా నిర్మాత దిల్ రాజు కూడా అదే రూట్లో వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే తమిళ్ సూపర్ హిట్ సినిమా '96' ను తెలుగులో శర్వా నంద్ - సమంతలతో రీమేక్ చేస్తున్న దిల్ రాజు ఇప్పుడు మరో రెండో రీమేక్ సినిమాలను రెడీ చేసుకుంటున్నాడని సమాచారం.
హిందీలో వచ్చిన 'పింక్' సినిమాను లేటెస్ట్ గా తమిళ్ లో అజిత్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో తన బ్యానర్ లో చేయడానికి చూస్తున్నాడట రాజు. ఇప్పటికే ఆ సినిమా రైట్స్ తీసుకొని టాలీవుడ్ లో ఓ టాప్ స్టార్ తో రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడని టాక్. అదొక్కటే కాదు హిందీలో మరో సూపర్ హిట్ సినిమా 'బదాయి హో' ను కూడా తెలుగులో బోణీ కపూర్ కలిసి నిర్మిస్తాడని అంటున్నారు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'బదాయి హో' ను తెలుగులో ఓ యంగ్ హీరోతో నిర్మించాలని ఫిక్సయ్యాడట సూపర్ హిట్ ప్రొడ్యుసర్. ప్రస్తుతానికైతే దిల్ రాజు బ్యానర్ నుండి '96'రీమేక్ ఒక్కటే అఫీషియల్ గా అందరికీ తెలుసు. మరి మిగతా రీమేక్ సినిమాల డీటెయిల్స్ ఎప్పుడు బయటికోస్తాయో..చూడాలి.