కాదేదీ పబ్లిసిటీకనర్హం!

Update: 2018-07-21 16:55 GMT
ఈ మోడరన్ లోకం మొత్తం పబ్లిసిటీ చుట్టూనే తిరుగుతుంది. నన్ను చూడు నా అందం చూడు అంటూ ఫేస్ బుక్ నిండా సగం యూజర్లు తీసుకున్న ఫోటోలు సెల్ఫీలే ఉంటాయి. ఇదేమంత నమ్మశక్యంగా లేదు అనుకుంటే దీనికి తాత లాంటి ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తారో చెప్పండి?  అదేపనిగా ఫోటోలు.. వీడియోలు వేళాపాళా లేకుండా అప్లోడ్ చెయ్యడమే.  వాళ్ళకే పనిలేదనుకుంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు అదే పనిగా ఎప్పుడెప్పుడు కొత్త పోస్టులు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. వీళ్ళందరూ ఒకదారిలో ఉంటే గోవిందం మరో దారిలో ఉండాలని ఆశించడం పొరపాటే.

కాబట్టే 'గీత గోవిందం' టీమ్ ఈ జనరేషన్ కు తగ్గట్టు గా కాదేదీ పబ్లిసిటీకనర్హం అని ప్రూవ్ చేస్తోంది. సంగతేంటంటే.. 'గీత గోవిందం' టీమ్ రీసెంట్ గా తమ సినిమా టీజర్ 22 వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.  కానీ ఇప్పుడు ఒకరోజు వాయిదా వేసి 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  సో.. కొత్త డేట్ ను ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.. కానీ వాళ్ళు దానికి ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అందులో టీజర్ 22 నే కానీ దిల్ రాజు కాల్ చేశారని - 'శ్రీనివాస కళ్యాణం' సినిమా టీజర్ ను అదే తారీఖున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, 'గీత గోవిందం' సినిమా టీజర్ ను 23 వ తేదీకి మార్చామని తెలిపారు.  

ప్రొడ్యూసర్ దిల్ రాజు కారణంగా డేట్ మార్చామని ఒక కొత్త పోస్టర్ వేసి మరీ 'గీత గోవిందం' టీమ్ చెప్పడం కొంతమందికి నెటిజనులకు నచ్చలేదు కానీ ఈ జెనరేషన్ కు తగ్గట్టు 'గీత గోవిందం' టీమ్ ఫాలో అయినట్టుగా ఉన్నారు.. గోవిందుడికి అంతా పబ్లిసిటీనే అని సరిపెట్టుకోవాలంతే. ఎందుకంటే మహాకవి శ్రీ శ్రీ 'కాదేదీ కవితకనర్హం' అని ఎప్పుడో చెప్పాడు.. ఇప్పుడు మనం కాదేదీ పబ్లిసిటీకనర్హం అని మార్చుకోవల్సినట్టుగా ఉంది!


Tags:    

Similar News