స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ లోకి సాఫీగా ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు. చాలా ఏళ్ల తరువాత తొలి సారి దిల్ రాజు తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న మూవీ `వారీసు`. స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో వుంది.
భారీ తారగణంతో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ నటిస్తున్న 66వ ప్రాజెక్ట్ ఇది. వంశీ పైడిపల్లితో పాటు హరి, `వైల్డ్ డాగ్` ఫేమ్ అహిషోర్ సాల్మన్ కథ అందించారు. హీరో విజయ్ కి వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది.
తమిళంలో `వారీసు`గా, తెలుగులో `వారసుడు`గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈ మూవీతో తొలిసారి దిల్ రాజు కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఎంట్రీ అంత సాఫీగా సాగేలా కనిపించడం లేదు. కారణం విజయ్ `వారీసు` రిలీజ్ కానున్న జనవరి 12నే తల అజిత్ నటిస్తున్న `తునీవు` కూడా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రొడ్యూసర్ బోనీకరపూర్ జనవరి 12నే విడుదల చేయాలని ఫక్స్ అయ్యాడట.
ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజిత్ తో ఇప్పటి వరకు `నేర్కొండ పార్వై`, `వాలిమై` వంటి సినిమాలని అందించిన హెచ్ వినోద్ ముచ్చటగా మూడవ సారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ కూడా సరికొత్తగా వుంటూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అంతే కాకుండా తమిళనాడు అంతటా ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ రెడ్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నాడు.
దీంతో అజిత్ సినిమాకే తమిళనాడు అంతటా అత్యధిక థియేటర్లని కేటాయించే అవకాశం వుందని, దీంతో విజయ్ `వారీసు`కు థియేటర్ల తక్కువగా లభిస్తాయని, దీనివల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దిల్ రాజుకు షాకిచ్చే విషయమని చెబుతున్నారు. సమీకరణాలు మారితే తప్ప దిల్ రాజు `వారీసు`తో అక్కడ పాగా వేయడం కష్టమని తమిళ వర్గాలు అంటున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతి రేస్ దిల్ రాజు కు గట్టి సవాల్ గా మారిందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.