మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అక్కడి స్టార్ కథానాయకుడు దిలీప్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన దిలీప్.. ఒకటిని నాలుగుసార్లు బెయిల్ తిరస్కరణకు గురయ్యాక చివరికి ఐదో ప్రయత్నంలో బెయిల్ అందుకుని బయటికి వచ్చాడు. ఐతే కొన్ని రోజుల్లోనే అతను మరో చేదు కబురు వినాల్సి వచ్చేలా ఉంది. ఎందుకటే ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం త్వరలోనే కోర్టుకు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సమర్పించనున్నట్లు సమాచారం. అందులో ఎ-1 ముద్దాయిగా దిలీప్ పేరునే చేరుస్తున్నట్లుగా కేరళ మీడియా రిపోర్ట్ చేసింది.
హీరోయిన్ని కిడ్నాప్ చేసింది.. ఆమెపై దాడి చేసింది పల్సర్ సునినే అయినప్పటికీ అతడికి ఆమెతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని విచారణలో తేలింది. మొత్తం కుట్రకు సూత్రధారి దిలీపే అని తేలడంతో అతడినే ఎ-1 ముద్దాయిగా సిట్ బృందం పేర్కొంటున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కేసులో దిలీప్ కు మరింత ఉచ్చు బిగుస్తున్నట్లే. సాక్ష్యాలు దిలీప్ కు వ్యతిరేకంగా బలంగా ఉండటంతో అతడికి భవిష్యత్తులో జైలు శిక్ష పడేందుకు ఆస్కారముందని అంటున్నారు. మరోవైపు దిలీప్ జైల్లో ఉండగానే రిలీజైన అతడి కొత్త సినిమా ‘రామ్ లీలా’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ సినిమా రిలీజై 50 రోజులు దాటుతున్నా.. ఇంకా మంచి వసూళ్లే రాబడుతోంది.