పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా నా 25 ఏళ్ల కల అని ప్రకటించిన దిల్‌రాజు ఆ కలని గత ఏడాది `వకీల్ సాబ్`తో నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత పవన్ నుంచి వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది. వసూళ్ల పరంగా మంచి ఫిగర్ లని నమోదు చేసింది. ఈ మూవీ తరువాత పవన్ పవర్ ఫుల్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్‌పై గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది.
ఫిబ్రవరి 25న లేదా? ఏప్రిల్ 1న కానీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుందంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. ఇదే సమయంలో `గని` రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయగడంతో భీమ్లా ఫిబ్రవరి 25న రిలీజ్ కష్టమని తేలిపోయింది. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీని ఇప్పటికైనా రిలీజ్ చేయాల్సిందే అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పట్టుపడుతున్నారట. వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ నైజాం హక్కుల్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు.
ఫిబ్రవరి 25న ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీని విడుదల చేయాల్సిందేనని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఏపీలో టికెట్ రేట్లని పెంచుతూ జీవొ వస్తుందని, 100 శాతం ఆక్యుపెన్సీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అందరిలాగే `భీమ్లా.. టీమ్ కూడా ఎదురుచూస్తోంది. ఆ రెండు ఉత్తర్వులు ప్రకటించిన తరువాతే సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇదే దిల్ రాజుకు చిక్కుల్ని తెచ్చిపెడుతోందని, ఆ కారణంగానే ఆయన భీమ్లాని ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరిలో విడుదల చేయాల్సిందేనని పట్టుపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దిల్ రాజు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని నిర్మిస్తూనే భారీ చిత్రాలని నైజాం, వైజాగ్ లలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. `భీమ్లా నాయక్`తో పాటు ఆయన రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలని కూడా పంపిణీ చేస్తున్నారు. మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ వరకు వరుసగా భారీ చిత్రాల రిలీజ్ వుండటంతో వాటిపై ప్రభావం పడకుండా వుండాలంటే `భీమ్లా నాయక్` ఫిబ్రవరిలోనే విడుదల కావాలని దిల్ రాజు బావిస్తున్నారట.
అయితే `భీమ్లా నాయక్` నిర్మాత వాదన మరోలా వుంది.. 100 శాతం ఆక్యుపెన్సీ, టికెట్ రేట్ల పెరుగుదలకు సంబంధించిన జీవోని ఏపీ ప్రభుత్వం విడుదల చేయకుండా `బీమ్లా నాయక్` ని విడుదల చేస్తే ఏపీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం వుందని, ఆ కారణంగానే `భీమ్లా రిలీజ్ ని హోల్డ్ లో పెడుతున్నారట. మరి నిర్మాత వాదనతో దిల్ రాజు ఏకీభవించి అంత వరకు ఆడుతాడా? లేక ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాల్సిందే అని నిర్మాతపై మరింత ఒత్తిడిని తీసుకొస్తాడా అన్నది మరో వారం రోజుల్లో తేలబోతోంది.